Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కండలు బాగా పెంచావ్ మెహబూబ్.. జోర్దార్ సుజాత హాట్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ షో ఎలా ఉన్నా కూడా గోడవలు ఎన్ని జరిగినా కూడా కంటెస్టెంట్స్ బయటకు వచ్చారు అంటే చాలా ఈజీగా కలిసిపోవడం కామన్. కొందరు వాటిని సీరియస్ గా తీసుకుంటే మరికొందరు మాత్రం చాలా ఫ్రెండ్లిగా తీసుకుంటారు. ఇక బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నామినేషన్స్ తో గోడవలు పడిన కంటెస్టెంట్స్ సుజాత, మెహబూబ్ బయటకు వచ్చిన తరువాత ఫ్రెండ్లిగా కలుసుకుంటున్నారు.
మెహబూబ్ నామినేషన్ ఎఫెక్ట్..
మెహబూబ్ దిల్ సే ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. ఎక్కువగా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఈ కంటెస్టెంట్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు ఫిజికల్ టాస్క్ లో అందరిని డామినేట్ చేశాడు. ఏ మాత్రం తగ్గకుండా గట్టి పోటీని ఇచ్చాడు. అయితే ఇక సుజాత విషయంలో అప్పుడు కొన్ని గొడవలు గట్టిగానే అయ్యాయి. మెహబూబ్ నామినేషన్ ఎఫెక్ట్ ఆమెపై గట్టిగానే పడింది.
మెహబూబ్.. ఆ విషయంలో హైలెట్
ఇక సుజాత మొదట బయటకు వచ్చాక ఆ తరువాత కొన్ని రోజులకు మెహబూబ్ కూడా బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ లో మెహబూబ్ ఎక్కువగా సోహెల్ తో బాండింగ్ ఏర్పరచుకున్నాడు. ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవారు. కెప్టెన్సీ విషయంలో కూడా మెహబూబ్ సోహెల్ కోసం త్యాగం చేసిన ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది.
స్పెషల్ గా కలుసుకున్న సుజాత
ఇక మొత్తానికి బయటకు వచ్చిన కొందరు కంటెస్టెంట్స్ స్పెషల్ గా కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మెహబూబ్ తన ఇంటికి గంగవ్వతో పాటు సుజాతను కూడా స్పెషల్ గా ఇన్వైట్ చేశాడు. ముగ్గురు కలిసి చాలా సేపు బిగ్ బాస్ ముచ్చట్లతో సరదాగా గడిపారు. ఇక సుజాత, మెహబూబ్ పై పంచ్ లు గట్టిగానే వేసింది.
కండలు బాగా పెంచావ్ మెహబూబ్
కండలు కూడా బాగా పెంచావ్ అంటూ మెహబూబ్ ను పొగిడిన సుజాత చాలా మంది బిగ్ బాస్ నుంచి వచ్చాక బరువు తగ్గారని నేను కూడా తగ్గాను అన్నట్లు మాట్లాడింది. ఇక మెహబూబ్ తన ఇంట్లోనే స్వయంగా వంట చేసి గంగవ్వకు, సుజాతకు ప్రత్యేకంగా వడ్డించాడు. ఇక చివరలో ఇద్దరి మధ్య ఒక గేమ్ పెట్టిన మెహబూబ్ గంగవ్వకు మొదట పట్టీలు గిఫ్ట్ గా ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడాడు. సుజాతకు స్వీట్స్ ను ప్రజెంట్ చేశాడు.