కెప్టెన్సీలో కూడా ఇంత మోసమా.. ఓక అమ్మాయికి కూడా అవకాశం ఇవ్వరా? హారిక కౌంటర్
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇస్తున్న టాస్క్ లు చాలానే వైరల్ అవుతున్నాయి. కానీ వాటిని పూర్తి చేయడంలో ఇంటి సభ్యులు కొన్ని సార్లు అంతగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లేదు. ఇప్పటివరకు జరిగిన టాస్క్ లలో ఎక్కువగా హోటల్ టాస్క్ వైరల్ అయ్యింది. అందులో ఆడియెన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ దొరికిందనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ లో ఇప్పుడు మెల్లగా లేడి కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ అవుతున్నారనే చెప్పాలి. ఈ వారం అయినా కెప్టెన్ గా అమ్మాయి అవుతుందని అనుకుంటే మోసం జరిగిందనే వాదన కూడా ఎక్కువవుతోంది.

సందర్భాన్ని బట్టి రంగులు మారుస్తున్నారు
బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పటి నుంచి కూడా ఎవరు కూడా టాస్క్ లో భాగంగా ఎక్కువగా అకట్టుకోవడం లేదు. అవినాష్ తప్పితే మిగతా వాళ్ళు సందర్భాలను బట్టి వాళ్ళ రంగును మారుస్తున్నారు గాని గేమ్ ని గేమ్ లా ఆడడం లేదని అనిపిస్తోంది. రీసెంట్ గా షోకి సంబంధించిన కెప్టెన్సీ విషయంలో హారిక అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయంపై బిగ్ బాస్ ని గట్టిగానే ప్రశ్నించింది.

అందరి చూపు అతని వైపే..
ఫిజికల్ టాస్క్ లో అమ్మాయికి , అబ్బాయికి కెప్టెన్సీ పోటీని నిర్వహించడం ఎంతవరకు న్యాయం అనే వాదన వినిపిస్తోంది. గురువారం ఎపిసోడ్ లో హౌజ్ కెప్టెన్సీలో పోటీగా నిలిచిన అవినాష్, అరియానాలకు ట్రాలీ టాస్క్ ఇచ్చారు. ఎవరు ఎక్కువమంది ప్యాసింజర్లను స్టేషన్ కి చేర్చగలిగితే వాళ్లే విజయం సాధించినట్లు అని చెప్పగా గేమ్ ఒకసారి టైగా ముగిసింది. ఇక చివరికి మోనాల్ ట్విస్ట్ ఇవ్వడంతో అవినాష్ గెలిచాడు. అందరూ అవినాష్ కి ఎక్కువగా మద్దతు ఇచ్చారని అర్థమైంది.

అభ్యంతరం వ్యక్తం చేసిన హారిక
నోయల్ చేతికి ఉన్న కెప్టెన్సీ బ్యాండ్ అవినాష్ దగ్గరకు చేరింది. అయితే ఈ విషయంలో హారిక అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతవరకు అమ్మాయికి కెప్టెన్ గా అవకాశం ఇవ్వలేదని తన వాదనను వినిపించగా అవినాష్ అరియానాకు రేషన్ మేనేజర్ పోస్టును ఇచ్చాడు. ఆ నిర్ణయంతో అవినాష్ రేంజ్ కాస్త పెరిగిందనే చెప్పాలి. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

కెప్టెన్ గా సెలెక్ట్ చేయకపోవడానికి కారణం..
అంతా బాగానే ఉంది కాని అరియానా ఫిజికల్ టాస్క్ లలో కూడా గట్టిగానే పోరాడింది. అయితే ఈ సారి కెప్టెన్ గా ఆమెను సెలెక్ట్ చేసి ఉంటే అమ్మయిలను కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అయ్యుండేవాళ్ళు. కానీ ఆమెకు ఓట్లు అవినాష్ కంటే తక్కువగానే వస్తున్నాయి. పైగా కొంటె రాక్షసుల టాస్క్ లో అవినాష్ ఎక్కువగా ఆకట్టుకున్నాడు. కానీ బయట మాత్రం అమ్మాయిలకు అన్యాయం జరుగుతోందనే కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. మరి ఫైనల్ లో అయినా ఒక అమ్మాయికి టైటిల్ అందుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











