బయటకు రాగానే బిగ్‌బాస్ గుట్టు విప్పిన సూర్య కిరణ్.. ఆ 50లక్షల కోసం వెళ్లలేదు!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి మొదటి వారం బాగానే కొనసాగింది. కానీ ఉహాలకందని రేంజ్ లో అయితే ట్విస్ట్ లు కనిపించలేదు. సూర్య కిరణ్ ఎలిమినెట్ అవుతాడని ముందే లీకయ్యింది. ఇక సూర్య కిరణ్ బయటకు రాగానే బిగ్ బాస్ కి సంబంధించిన గుట్టు విప్పాడు. లోపల జరిగే విషయాలని అలాగే తాను ఎందుకు అక్కడికి వెళ్ళాను అనే విషయాన్ని కూడా చెప్పాడు.

చనిపోయనని వార్తలు వేశారు

చనిపోయనని వార్తలు వేశారు

సూర్య కిరణ్ మాట్లాడుతూ.. మొదటి సినిమా సత్యం తరువాత మరికొన్ని సినిమాలను డైరెక్ట్ చేశాను. అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల చెన్నై వెళ్ళాను. అప్పుడు నేను కనిపించకపోవడంతో చనిపోయినట్లు ఒక వార్త క్రియేట్ చేశారు. అలాంటి చెడు వార్తకు సరైన సమాధానం చెప్పాలని మళ్ళీ సినిమా చేయాలని అనుకొని రెడీ అయ్యాను.

ఆ సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది

ఆ సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది

ఈ ఏడాది ఉగాదికి కొత్త సినిమాను స్టార్ట్ చేయాలని ఒక ప్లాన్ కూడా రెడీ చెలుకున్నాను. కానీ లాక్ డౌన్ కారణంగా ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఆ తరువాత సడన్ గా బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అలాంటి పెద్ద ఫ్లాట్ ఫామ్ ద్వారా నా ఉనికిని చాటుకోవాలని అనుకున్నాను. జనాలకు ఈజీగా దగ్గరవచ్చనే విధంగా షోలోకి అడుగు పెట్టాను.

ఆ రూ.50లక్షల కోసం కాదు

ఆ రూ.50లక్షల కోసం కాదు

అయితే బిగ్ బాస్ లో కనీసం మూడు నుంచి నాలుగు వారాలైనా ఉండాలని అనుకున్నాను. కానీ వారం రోజులే ఉన్నాను. అయినప్పటికీ అది చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. టీచర్ లేని స్కూల్ ఉన్నట్లుగా బిగ్ బాస్ హౌజ్ తయారయ్యింది. పదేళ్ళ గ్యాప్ రావడం వలనే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాను. అంతేగాని అందులో గెకుచుకునే రూ.50లక్షల కోసం కాదు.

చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు

చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు

హౌజ్ లో అమ్మా రాజశేఖర్ తప్పితే పెద్దగా సినిమావాళ్ళు ఎవరు లేరు. వారికి ఇది ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ మంచి విషయాలు చెబితే నడుచుకునే వారు లేరు. ఇక హౌజ్ లో కంటెస్టెంట్స్ కొందరు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు. ఫీలింగ్స్ చాలా వరకు ఆర్టిఫీషియల్ గా ఉంటున్నాయి.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 8 Highlights,సూర్య కిరణ్ ఎలిమినేటెడ్!
 ఆ తెలివి తేటలు నాకు లేవు

ఆ తెలివి తేటలు నాకు లేవు

వాళ్ల నవ్వు కూడా సహజంగా లేదు. మునుపెన్నడూ బిర్యానీ చూడనట్లుగా యాక్ట్ చేస్తున్నారు. హౌజ్ లో ప్రతీ రోజు నాకైతే భారంగా అనిపించింది. ఇక షోలో ఎక్కువగా ఫోకస్ అవ్వాలి అంటే ఏం చేయాలో వాళ్ళకు తెలుసు. ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తేనే టీవీల్లో కనిపిస్తామని అనుకుంటూ ఉంటారు. ఇక అన్ని తెలివి తేటలు నాకు లేవని మొత్తానికి బిగ్ బాస్ ఒక కొత్త అనుభూతిని ఇచ్చినట్లు సూర్య కిరణ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X