Bigg Boss 4 final: ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఏండింగ్ వరకు జరగబోయే ఇదే.. హైలెట్స్ లీక్
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఈ రోజుతో ముగుస్తుంది. ఫైనల్ ఎవరనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ విషయం పక్కన పెడితే సీజన్ 4 ఫైనల్ షో ఎలా కొనసాగుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానున్న ఈ షోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేశారట. ఒకసారి షో కొనసాగే విధానంపై ఒక లుక్కేస్తే..

నాగ్ ఎంట్రీతో షో స్టార్ట్..
శనివారం కనిపించని అక్కినేని నాగార్జున ఈ రోజు జరగబోయే ఫైనల్ ఎపిసోడ్ లో మాత్రం డబుల్ డోస్ రచ్చతో ఎట్రాక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున బ్లాక్ బస్టర్ ఎంట్రీ అదిరిపోతుందట. గ్రాండ్ ఎంట్రీ లోనే మన్మథుడు తన డ్యాన్స్ కూడా ఆకట్టుకుంటారట. నాగ్ లుక్ ఎలా ఉంటుందా అని ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

లవ్ స్టొరీ కోసం సాయి పల్లవి, నాగచైతన్య
ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా లవ్ స్టొరీ టీమ్ స్టేజ్ పైకి రానున్నట్లు తెలుస్తోంది. కథానాయకుడు నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల ఫైనల్ లో సందడి చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో అఖిల్ సమంత ఏ రేంజ్ లో హడావుడి చేశారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చైతూ కూడా రావడంతో అక్కినేని ఫ్యామిలీ దాదాపు కవర్ అయినట్లు చెప్పవచ్చు.

మొదట హారిక.. అవుట్!
ఇక మొదటగా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ హారిక అని తెలుస్తోంది. అందుకు సంబంధించిన రూమర్స్ గత రాత్రి నుంచే వైరల్ అవుతున్నాయి. టాప్ 5లో ఆమె మొదట ఎలిమినెట్ అయిన అనంతరం హీరోయిన్ మెహ్రీన్ హాట్ డ్యాన్స్ పెర్ఫెమెన్స్ కూడా ఉంటుందట.

థమన్, నోయేల్ పెర్ఫామెన్స్
అనంతరం థమన్ కూడా తన స్పెషల్ మ్యూజిక్ పెర్ఫెమెన్స్ తో ఆకట్టుకుంటాడాని తెలుస్తోంది. ఆయనతో పాటు కంటెస్టెంట్ గా పాల్గొన్న సింగర్ నోయేల్ కూడా డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో ఇరగదీసినట్లు సమాచారం. ఇక కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి షోలో స్పెషల్ గెస్ట్ గా మెరిసినట్లు సమాచారం.

శనివారం జరిగిన స్టోరీ ఇదే..
అనిల్ రావిపూడి ద్వారా టాప్ 4 కంటెస్టెంట్ పై క్లారిటీ ఇస్తారట. ఇక అరియానా టాప్ 4లో ఎలిమినెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక శనివారం వరకు జరిగిన స్టోరీ ఇదే. ఇక ఆదివారం మధ్యాహ్నం లోపే షోకు సంబంధించిన టోటల్ షూట్ ను కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. సోహెల్, అఖిల్, అభిజిత్ లలో ఎవరు ఫైనల్ విన్నర్ అనేది ఈ రోజుతో తేలిపోతుంది.

గెస్ట్ గా మెగాస్టార్..
గత ఏడాది రాహుల్ సిప్లిగంజ్ ను సీజన్ 3 విన్నర్ గా ప్రకటించినప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి కూడా మెగాస్టార్ మళ్ళీ రాబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబును కూడా పిలిచారని మొదట్లో టాక్ వచ్చింది. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ఇక మరోసారి మెగాస్టార్ గెస్ట్ గా వచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











