Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్బాస్లో సినిమా మేకింగ్.. మోనాల్ పై అభి, అఖిల్ కౌంటర్లు, లాస్య ఐటెమ్ రాజా డైలాగ్
బిగ్ బాస్ హౌజ్ లో లవ్ స్టొరీ అనగానే గుర్తొచ్చేది మోనాల్, అభిజిత్ కాంబినేషన్. ఇక మరో అర్జున్ రెడ్డి లవర్ బాయ్ అఖిల్ కూడా దాన్ని ట్రయాంగిల్ గా మార్చేశాడు. షో మొదలైనప్పుటి నుంచి కూడా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అసలు ఒక క్లారిటీ రావడం లేదు. మోనాల్ కారణంగా అబిజిత్, అఖిల్ మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం వీరిమధ్య ఒక కామెడీ సీన్ జరిగేలా ఉందని అర్ధమవుతోంది.
వారిద్దరితో కామెడీ చేసిన మోనాల్
శుక్రవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమోను రిలీజ్ చేయగా అందులో అబిజిత్ డైరెక్టర్ అవతారం ఎత్తగా మోనాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అఖిల్ ఎలాంటి పాత్ర చేస్తున్నాడో తెలియదు గాని హీరోయిన్ ని దర్శకుడికి పరిచయం చేసే పని పెట్టుకున్నాడు. ఆ సమయంలో అభిజిత్ మోనాల్ పై వేసిన కౌంటర్ మామూలుగా లేదు.
బిగ్ బాస్ బ్లాక్ బాస్టర్..
ఈ రోజు జరగబోయే టాస్క్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ బ్లాక్ బాస్టర్ అనే ఈ టాస్క్ లో ఇంటి సభ్యులందరు కలిసి ఒక సినిమా తీయాల్సి ఉంటుందని లాస్య వివరణ ఇచ్చింది. ఇక ఆ తరువాత లైట్ బాయ్ నుంచి యాక్టింగ్ వరకు ఒక్కొక్కరు ఒక్కో పనిలో బిజీ అయ్యారు. ఇక దర్శకుడిగా సిద్దమైన అబిజిత్ అందరిని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నట్లు అనిపించింది.
మోనాల్ పై ఒకేసారి పంచ్ వేసిన అఖిల్, అభి
హీరోయిన్ మోనాల్ ని డైరెక్టర్ అభిజిత్ కి పరిచయం చేయగా.. హీరోయిన్ ఇలా ఉందేంటి అని అఖిల్ కి కౌంటర్ ఇచ్చాడు. అఖిల్ కూడా మేకప్ లేకుంటే ఇలానే ఉంటుందని మోనాల్ పైనే మరో పంచ్ వేశాడు. మరోవైపు అరియానా, అవినాష్ బావా మరదళ్లుగా కనిపించారు. ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో బావా అంటూ అరియానా కౌంటర్ ఇచ్చిన విధానం వైరల్ గా మారింది.
Recommended Video
ఐటెమ్ రాజా అనేసిన లాస్య
ఇక నోయల్ కెమెరామెన్ గా అమ్మా రాజశేఖర్ డ్యాన్స్ మాస్టర్ గా వర్క్ చేశారు. ఇక చివరలో మోనాల్ దగ్గర సీన్ లో భాగంగా మాట్లాడుతున్న లాస్య అతనొక ఐటెమ్ రాజా అంటూ సోహైల్ పై మరో కౌంటర్ వేసింది. దెబ్బకు అందరికి నవ్వు వచ్చేసింది. ఇక ఈ రోజు షోలో రియాలిటీ ఎంటర్టైన్మెంట్ డోస్ గట్టిగానే పేరిగినట్లు తెలుస్తోంది. గత రెండు మూడు రోజులు గొడవలు బాగానే జరిగాయి. మరి ఈ రోజు షూటింగ్ తో ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.