బిగ్‌బాస్4: కమెడియన్‌ని ఒక ఆటాడుకున్న గంగవ్వ.. నాలుక మడతపెట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది
బిగ్ బాస్ 4 మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. మొదటి వారం నాగార్జున స్టార్ట్ చేసినప్పుడు బాగానే కొనసాగిన ఈ రియాలిటీ షో వారంతరం మాత్రం ఊహించని విధంగా కొంత బోర్ కొట్టించింది. అందుకు కారణం కంటెస్టెంట్స్ రియల్ గా గేమ్ అడకపోవడమే. ఇక నాగార్జున ఒక్కసారిగా వార్నింగ్ ఇవ్వడంతో షో మళ్ళీ పుంజుకుంది. షోలో రియాలిటీ ఉండాలని అందరిలో ఒక స్పిరిట్ నింపారు. ఇక కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఎపిసోడ్ లో గంగవ్వ తన స్కిల్స్ తో ఎంతగానో మెప్పించింది.

సరదాగా...డాగ్ అండ్ బోన్ గేమ్
ఎలిమినేషన్ ప్రక్రియ మొదకవ్వగానే హౌజ్ మెంట్స్ తో నాగార్జున ఒక స్పెషల్ గేమ్ ఆడించారు. షోలో ఎప్పటికప్పుడు వాతావరణాన్ని చేంజ్ చేస్తూనే ఉన్న నాగార్జున ఆదివారం ఎపిసోడ్ లో ట్విస్ట్ లు ఇవ్వడమే కాకుండా అందరి కోసం ఒక ఫన్ ని క్రియేట్ చేశారు. అందరితో డాగ్ అండ్ బోన్ అనే గేమ్ ఆడించారు. ఇద్దరు ఆ బోన్ చుట్టూ తిరుగుతూ పాట ఆగిపోగానే దాన్ని అందుకోవాలి.

జోరుగా స్టెప్పులు వేస్తూ..
గేమ్ లో ఓడిన వారికి ఒక పనిష్మెంట్ కూడా ఉంటుందని నాగార్జున ముందుగానే సూచించగా అందరూ ఈ గేమ్ లోపోటాపోటీ పాల్గొన్నారు. ఇక గంగవ్వ కమెడియన్ సాయి కుమార్ తో చాలా హుషారుగా పోటీ పడింది. పైసా వసూల్ పాటకు జోరుగా స్టెప్పులేస్తూనే సాయిని ఒక ఆటాడుకుంది. చివరికి అతన్ని ఓడించింది కూడా.

నాలుకను మడతపెట్టి..
గంగవ్వ నాలుకను మడతపెట్టి డ్యాన్స్ చేసిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సాయి కుమార్ కూడా ఆమెకు సరైన స్థాయిలోనే పోటీని ఇస్తాడాని అనుకున్న సమయంలో సడన్ గా పాట ఆగిపోవడంతో గంగవ్వ బోన్ ని కరెక్ట్ సమయంలో అందుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు క్లిప్పింగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recommended Video

మరో మూడు వారాల పాటు..
రోజురోజుకి గంగవ్వకు భారీ స్థాయిలో మద్దతు పెరుగుతోంది. కానీ కొన్నిరోజుల క్రితం ఆమె తన ఆరోగ్య పరిస్థితిపై కొంత ఆందోళన చెందడంతో అభిమానులు కాస్త షాక్ అయ్యారు. ఇక ఆమెకు సరైన వైద్యం అందించడంతో గంగవ్వ మళ్ళీ ముందులాగే హై ఎనర్జీతో కనిపించింది. ఇక ఆమెను మరో మూడు వారాల పాటు కొనసాగించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











