బిగ్ బాస్ ఫైనల్స్‌కు డేట్ ఫిక్స్: ఇప్పటి నుంచే ఆ పనులు మొదలెట్టిన యూనిట్
తెలుగు బుల్లితెరపై మరే షోకూ సాధ్యం కాని రీతిలో రికార్డుల మీద రికార్డు క్రియేట్ చేస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం నాలుగో సీజన్ సైతం ప్రసారం అవుతోంది. భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సీజన్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఫలితంగా ప్రీమియర్ ఎపిసోడ్‌తో నేషనల్ రికార్డులు బద్దలు కొట్టేశారు. అలాగే ఓటింగ్ సైతం ఈ సీజన్‌లోనే ఎక్కువగా నమోదవుతోంది. దీంతో ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభమై దాదాపు మూడున్నర నెలలు కావొస్తుంది. ఈ సమయంలో హౌస్‌లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ చూడని కొన్ని టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, లవ్ ట్రాకులు, రొమాంటిక్ సన్నివేశాలతో పాటు స్పెషల్ సర్‌ప్రైజ్‌లతో ఈ సీజన్ మజాను పంచుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఈ వారం ఇంటి నుంచి ఒకరు బయటకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫినాలే గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు డిసెంబర్ 20ని ఫిక్స్ చేశారట. అందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్లు చేస్తోందట షో యూనిట్. గెస్టుగా ఎవరిని తీసుకు రావాలి.? ఫైనల్స్‌లో ఎలాంటి గేమ్స్ ఆడించాలి.? ఎలిమినేషన్, విజేతను ఎలా ప్రకటించాలి.? అన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారట. గతంలో జరిగిన సీజన్లలో ఫినాలే ఎపిసోడ్స్‌కు మంచి రేటింగ్ వచ్చింది. మొదటి సీజన్‌లో ఎన్టీఆరే ట్రోఫీని అందించగా, రెండో సీజన్‌లో వెంకటేష్, మూడో దాంట్లో చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











