Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఏమైనా నీతోనే చేపించుకోవచ్చు.. దేత్తడి హారికలో కొత్త కోరికలు, అభిజిత్‌ని వదిలేలా లేదు
బిగ్ బాస్ హౌజ్ సీజన్ 4 మొత్తానికి ఒక ఎంటర్టైన్మెంట్ ట్రాక్ లోకి వచ్చినట్లు అర్ధమవుతోంది. హోటల్ టాస్క్ లో ఎవరికి వారు బెస్ట్ పెర్ఫామెన్స్ తో కెమెరాలా ముందు రెచ్చిపోతున్నారు. ఇక మొన్నటివరకు డిఫరెంట్ డిఫరెంట్ లవ్ ట్రాక్స్ నడువగా ఇప్పుడు మరో కొత్త ప్రేమ కథలు మొదలైనట్లు అనిపిస్తోంది. అయితే ఇది కేవలం ఒక గేమ్ లో గ్యాంబ్లింగా లేక ఎట్రాక్షన్ కోసం చేస్తున్నారా అనేది బజర్ మోగే వరకు తెలియదు. ముఖ్యంగా దేత్తడి హారికలో ఒక కొత్త ప్రేయసి కనిపిస్తోంది.
ఆగ్రహంతో ఊగిపోతున్నారు..
రీసెంట్ గా అవినాష్ సీక్రెట్ టాస్క్ లో భాగంగా మొదలైన బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఎవరు ఊహించని విధంగా యూ టర్న్ తీసుకుంటోంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మరింత ముదురుతున్నాయి. ఒక్కసారి బజర్ మొగని రివెంజ్ తీర్చుకునే ఆప్షన్ దొరకదా? అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక ఈ గొడవలలో అభిజిత్, మోనల్, అఖిల్ లవ్ ట్రాక్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి.
మోనల్ ముద్దులు, కౌగిలింతలు
మొన్నటి వరకు ప్రేమ దేశం లవ్ స్టోరీలో అనేక రకాల గొడవలే వచ్చాయి. మోనల్ అయితే తన పరువు తీసేస్తున్నారు అంటూ ఏ స్థాయిలో అరిచేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం అఖిల్ ని హగ్ చేసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఆడియెన్స్ కి మరో విధంగా షాక్ ఇచ్చింది. నిన్ననే ఆగ్రహంతో ఊగిపోయి.. ఇప్పుడు నువ్వే ఇలా చేస్తున్నావ్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వస్తున్నాయి.
నాకు ఏ సర్వీస్ కావాలన్న నీతోనే
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే దేత్తడి హారిక కూడా మెల్లగా తనలోని రొమాంటిక్ ఫీల్ ని బయటపెడుతూ అభిజిత్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ఒకవైపు అందరు టాస్క్ లో గొడవ పడుతుంటే వీళ్ళిద్దరూ మాత్రం ఆపోజిట్ టీమ్ లో ఎందుకు వేసావ్ బిగ్ బాస్ అంటూ కామెంట్స్ చేశారు. "నాకు ఏ సర్వీస్ కావాలన్న నీతోనే చేపించుకోవచ్చు" అంటూ సిగ్గుపడిన హారిక చివర్లో కెమెరా ముందు కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అందుకు కారణం ఏదైనా ఆమె మనసు అభిజిత్ వైపు మళ్ళీనట్లు అర్ధమవుతోంది.
Recommended Video
అవినాష్ వెన్నుపోటు.. అమ్మా రాజశేఖర్ ఏమైపోతాడో..?
మరోవైపు అవినాష్ టాస్క్ లో పెడుతున్న చిచ్చులు మామూలుగా లేవు. మెహబూబ్ , సోహైల్ ఇద్దరు కూడా హోటల్ మేనేజ్మెంట్ పై చిరకుతో అరిచేలా చేయడానికి ముఖ్య కారకుడయ్యాడు. బిర్యానిలలో పిన్నీస్ పెట్టడం, వెంట్రుకలు వేయడం వంటి మోసలతో హోటల్ మేనేజ్మెంట్ ని వెన్నుపోటు పొడిచాడు. ఇక ఈ విషయం తెలిస్తే అమ్మా రాజశేఖర్ ఏమైపోతాడో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.