బిగ్ బాస్ ఓటింగ్‌పై అనుమానాలు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన నాగార్జున
గతవారం అక్కినేని కోడలు సమంత హోస్ట్ గా కొనసాగిన బిగ్ బాస్ షో ఈ సారి కూడా అలానే కొనసాగుతుందని అంతా అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. సమంత భారంగా ఫీలయ్యిందో లేక బిజీగా ఉందొ తెలియదు గాని మొత్తానికి బిగ్ బాస్ కి ఎండ్ కార్డ్ పెట్టేసింది. ఇక అక్కినేని నాగార్జున మళ్ళీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన సరికొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

నాగార్జున ఎంట్రీతో అనుమానాలన్ని క్లియర్
నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతోనే షోకి ఒక ప్రత్యేకమైన కళ వచ్చింది. అలాగే హౌజ్ లో ఇప్పటివరకు ఉన్న అనుమానాలకు అపోహలకు తెరదించుతూ అటు హౌజ్ మెంట్స్ కి అలాగే ఆడియెన్స్ కి కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ రహస్య చర్చల నుంచి వారి అసలు రంగులను బయట పెట్టడం వరకు అన్ని మన టీవీలో చూపించారు.

మోనాల్ ని కావాలని సేవ్ చేస్తున్నారు..
ఇక చాలా కాలంగా బిగ్ బాస్ ఓటింగ్ పై అనుమానాలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. కుమార్ సాయి ఎలిమినేషన్ నుంచి దివి వెళ్లిపోవడం వరకు అంతా మోసమే జరిగిందనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక మోనాల్ కి ఓట్లు తక్కువగా వచ్చినప్పటికీ ఆమెని కావాలని సేవ్ చేస్తున్నారని విమర్శలు వచ్చాయి.

ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన నాగార్జున
ఇక వీటన్నింటిపై ఉన్న అనుమానాలకు ఒక్క మాటలో తెరదించారు నాగార్జున. ఈ వారంలో ఎలిమినేషన్స్ లో ఉన్న అమ్మా రాజశేఖర్, లాస్య, మోనాల్, మెహబూబ్, అఖిల్, అరియానా.. జనాలు వేసే ఓట్ల ద్వారానే సేవ్ అవుతారని, తక్కువ వచ్చిన కంటెస్టెంట్ హౌజ్ నుంచి బయటకు వెళతారని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని అంటూ ఇక థర్డ్ పార్టీ ఓట్లను ఆడిట్ చేస్తుందని చెప్పారు.

వాళ్ళిద్దరు డేంజర్ జోన్ లోనే..
ఇక నాగార్జున చెప్పిన తరువాత మోనాల్ కి ఓట్లు అంత తక్కువగా రాలేదని అర్ధమవుతోంది. దివి, కుమార్ సాయి ఎలిమినేషన్స్ లో ఎలాంటి మోసం లేదని నాగార్జున ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇస్తున్నప్పటికి ఈ విషయంపై మళ్ళీ కొత్త అనుమానాలు పూట్టుకొస్తున్నాయి. ఇక అమ్మా రాజశేఖర్, మెహబూబ్ ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లు అర్ధమవుతోంది. మరి ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











