నాపై కుట్ర జరిగింది.. కావాలనే ఎలిమినెట్ చేశారు.. బిగ్ బాస్ గుట్టు విప్పిన కరాటే కళ్యాణి

బిగ్ బాస్ సిజన్ 4 రోజుకో ట్విస్టుతో మరింత ఉత్కంఠను రేపుతోంది. మొదటి రెండు వారాలు నామమాత్రంగా కొనసాగినప్పటికి మూడవ వారం కంటెస్టెంట్స్ మధ్య చెలరేగుతున్న వివాదాలు హౌజ్ లో వాతావరణాన్ని చేంజ్ చేస్తున్నాయి. ఇక సీనియర్ నటీమణి కరాటే కళ్యాణి రెండవ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. ఇక బయటకు వచ్చిన ఆమె ఎక్కడో మోసం జరిగిందని తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని కామెంట్స్ చేసింది.

 బిగ్ బాస్ 1లోనే నేను పాల్గొనాల్సింది..

బిగ్ బాస్ 1లోనే నేను పాల్గొనాల్సింది..

కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ఎదో కుట్ర జరుగుతున్నట్లు మొదటి నుంచి నాకు అనుమానం వస్తూనే ఉంది. అసలైతే బిగ్ బాస్ సీజన్ 1లోనే నేను పాల్గొనాల్సింది. కానీ అప్పుడు రాజా ది గ్రేట్ సినిమాలో ఆఫర్ రావడం వలన ఇప్పుకోలేకపోయాను. ఇక బిగ్ బాస్ 4లో పాల్గొనడం నిజంగా చాలా బాధను కలిగించింది. కంటెస్టెంట్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం వలన మనకు ఇది సేటయ్యేలా లేదని అనుకున్నా.

వెన్నుపోటు పొడిచారని చెప్పగలను

వెన్నుపోటు పొడిచారని చెప్పగలను

నేను ఏం చెప్పినా కూడా హౌజ్ లో ఎవరు కూడా సరిగ్గా రిసీవ్ చేసుకునేవారు కాదు. నేను ఎలిమినెట్ అయినప్పుడు కొంతమంది మాత్రమే భాధపడ్డారు. ఒక విధంగా కొందరు నన్ను వెన్నుపోటు పొడిచారని చెప్పగలను. అలాంటి పాలిటిక్స్ నాకు రావు. నిజజీవితంలో నటించలేను. బిగ్ బాస్ లో ఇప్పుడు ఉన్నవాళ్ల అసలు రంగు ఇంకా బయటపడలేదు. వాళ్లకు అడ్డుగా నేను ఉన్నానని ప్లాన్ వేసి బయటకు పంపారు.

 నన్ను బయటకు తోసేస్తే..

నన్ను బయటకు తోసేస్తే..


ఇక హౌజ్ లో అంధరికంటే బెస్ట్ కంటెస్టెంట్స్ నేనే అని చెప్పగలను. ఒక విధంగా వాళ్ళు నన్ను చూసి బయటపడ్డారు. నన్ను బయటకు తోసేస్తే లైన్ క్లియర్ అవుతుందని అనుకున్నారు. హౌజ్ లో మసాలా మాత్రమే నడుస్తోంది. నాకు మొదటి వారం ఓట్లు చాలా తక్కువగా వచ్చాయి. ఒక వారం రోజుల్లోనే మనిషిని జడ్జ్ చేయడం అంత ఈజీ కాదు.

బయటకు వచ్చాక ఒక విషయం తెలిసింది..

బయటకు వచ్చాక ఒక విషయం తెలిసింది..


నేను బయటకు వచ్చాక ఒక విషయం తెలిసింది. చాలా మంది నేను బాగా ఆడానని అంటున్నారు. నాకు గ్యాప్ లేకుండా, ఫోన్లు, మెస్సేజ్ లు వచ్చాయి. సూర్యకాంతం లాంటి యాక్టర్ మళ్ళీ పుట్టిందని సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వచ్చాయి. ఫస్ట్ వీక్ లో నన్ను తిట్టుకున్నవాళ్లే ఇప్పుడు బయటకు రావడం వలన బాధపడుతున్నారు.

Recommended Video

Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
ఆధారాలు ఉన్నాయి కాబట్టే..

ఆధారాలు ఉన్నాయి కాబట్టే..

ఓట్ల విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఎదో కుట్ర జరిగిందని అనిపిస్తోంది. నాకు ఓటు వేయాలని చాలా మంది కాల్ చేయగా మరొకరికి ఓట్లు పడేలా సెట్ చేశారని తెలిసింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయి. ఈ పని ఎవరు చేశారో తెలియదు గాని ఆడియెన్స్ మాత్రం చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఇంత దైర్యంగా మాట్లాడుతున్నాను.. అని కరాటే కళ్యాణి వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X