బిగ్ బాస్ హౌస్‌లో ఆ నలుగురి బ్యాచ్.. మళ్ళీ ఒకే మాట ఒకే ఆట..
బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగానే ఆడియెన్స్ ఏ విధంగా ఫీల్ అయ్యారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీళ్ళకు అంత సీన్ లేదు అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇంతకంటే బెస్ట్ సెలబ్రెటీలు ఎవరు దొరకలేదా అని కూడా మరికొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చేలా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ షోకి మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక గోడవలతో, మాస్టర్ ప్లాన్స్ తో ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు.

ఆ నలుగురు.. మరింత బలంగా
బిగ్ బాస్ లో ఆ నలుగురి బ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నోయల్ ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. లాస్య, అభిజిత్, హారిక ఒకే మాట ఒకే ఆట అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు. మధ్యలో సోహైల్ వీరి గ్యాంగ్ లో చేరడానికి ట్రై చేశాడు గాని అంతగా కలవలేకపోయాడు. కానీ వీళ్ళు ఎన్ని గోడవలైనా కూడా విడిపోవడం లేదు.

మాస్టర్, అవినాష్ లను టార్గెట్ చేస్తూ..
ఇటీవల కంటెస్టెంట్స్ నామినేషన్ ప్రక్రియ మొదలవ్వగానే అబిజిత్ తో పాటు, మోనాల్, లాస్య ఒకే తరహాలో ఆలోచించి నామినేట్ చేయడం మరోసారి వైరల్ అయ్యింది. ఇది హౌజ్ లో కొందరికి నచ్చలేదు. ముఖ్యంగా మాస్టర్, అవినాష్ లను టార్గెట్ చేసి నామినేట్ చేయడంతో వారు ఆ బ్యాచ్ పై మరోసారి ఫైర్ అయ్యారు. లాస్య ఒక గుడ్డును అవినాష్ పై మరో గుడ్డును మాత్రం మోనాల్ తలపై కొట్టింది.

అసహనం వ్యక్తం చేసిన అవినాష్
అబిజిత్, అమ్మా రాజశేఖర్ మధ్య గోడవ ఎక్కువవుతున్న సమయంలో హౌజ్ లో ఎవరికి కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వాలని చూడలేదు. మధ్యలో అవినాష్ రావడంతో అభిజిత్ కోసం హారిక రంగంలోకి దిగింది గాని మాస్టర్ ఇచ్చిన డోస్ కి తట్టుకోలేకపోయింది. ఇక ఆమెను అవినాష్ నామినేట్ చేశాడు. నీ కోసం నువ్వు గేమ్ ఆడు అంతేగాని మరొకరి గురించి ఆడకు అంటూ అవినాష్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు.

నా హైట్ గురించి మాట్లాడటం నచ్చలేదు.
హారిక కూడా అదే తరహాలో అవినాష్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నా ఆట నాకు తెలుసు అన్నట్లుగా ప్రవర్తిస్తు.. నువ్ నా హైట్ గురించి మాట్లాడటం నిజంగా నాకు నచ్చలేదు. మొన్న నాగార్జున సర్ ముందు కూడా అలానే అన్నావ్ అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ కవరింగ్ ఇచ్చింది హారిక. నిజానికి ఆమె ఎందుకు అవినాష్ ని నామినేట్ చేసిందో అందరికి చాలా ఈజీగా అర్ధమయ్యింది. మరి ఈ నామిమేషన్ ప్రక్రియ ముందు ముందు ఇంకెలాంటి వివాదాలకు దారి తీస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











