మూడు పూటలు వండి పెడితే.. అలా చేస్తావా? అవినాష్‌పై భగ్గుమన్న లాస్య

మొదటి నుంచి కూడా తన నవ్వుతోనే ఆడియెన్స్ ని అలాగే కంటెస్టెంట్స్ ని ఎట్రాక్ట్ చేసిన లాస్య గత వారం నుంచి మాత్రం ఎక్కువగా నెగిటివ్ గా మారుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా లాస్యతో స్నేహంగా ఉన్న వారు కూడా శత్రువులుగా మారుతున్నారు. పైగా నాగార్జున శనివారం లాస్య పుల్లలు పెట్టిన వీడియోలను కూడా బయటపెట్టడంతో ఆమెకున్న శత్రువుల సంఖ్య పెరిగిందని అర్ధమయ్యింది.

శత్రువులను పెంచుకుంటున్న లాస్య

శత్రువులను పెంచుకుంటున్న లాస్య

ముందు నుంచి కూడా లాస్య తనకంటూ ఒక గ్యాంగ్ ఉండాలని కొందరిని తన వైపుకు తిప్పుకుంది. అభిజిత్, హారిక, నోయల్ తో పాటు సోహైల్ తో కూడా ఆమె సిస్టర్ సెంటిమెంటును బాగానే ఉపయోగించుకుంది. ఈ వారం లాస్య ఎలిమినేషన్ వరకు వచ్చింది అంటే పరిస్థితులు ఆమెకు ఎంత నెగిటివ్ గా మారాయో అర్థం చేసుకోవచ్చు. కానీ వెళుతూ వెళుతూ నోయల్ ఆమెను సేవ్ చేశాడు.

కన్నింగ్ స్మైల్.. పుల్లలు పెడుతూ..

కన్నింగ్ స్మైల్.. పుల్లలు పెడుతూ..

హౌజ్ లో కన్నింగ్ స్మైల్ అనే పదం ఎంతగా వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆఖరికి సమంత కూడా ఆ పదం గురించి వివరణ ఇవ్వడంతో లాస్య రేంజ్ ఎక్కడి వరకు వెళ్లిందో అర్ధమయ్యింది. అయినప్పటికీ ఆమెకు కొంత ఆడియెన్స్ బలం ఉంది. ఇక అభి, మోనాల్ మధ్య పుల్లలు పెడుతున్న ఒకే ఒక్క కారణం ఆమెకు షాక్ తగిలేలా చేసింది.. మోనాల్ కి విషయం తెలియడంతో లస్యనే తన విలన్ అని చెప్పేసింది.

లాస్యను విలన్ చేసిన అవినాష్

లాస్యను విలన్ చేసిన అవినాష్

ఇక కంటెస్టెంట్స్ ని విలన్స్ ఎవరనే క్రమంలో అవినాష్ ని అడగడంతో కాస్త తటపటాయించగా చివరకు లాస్య అని చెప్పేశాడు. అందుకు కారణం ఏమిటని నాగార్జున అడగ్గా.. నామినేషన్స్ లో చెప్పిన కారణాన్నే చెప్పాడు అవినాష్. టీ అడిగినప్పుడు అందరికి ఇచ్చింది కానీ నాకు మాత్రం ఇవ్వలేదని చెబుతూ.. అది నన్ను చాలా బాధను కలిగించిందని అందుకే లాస్య విలన్ అని చెప్పాడు అవినాష్.

మూడు పూటలు వండి పెడితే..

మూడు పూటలు వండి పెడితే..

ఇక మరోసారి టార్గెట్ చేయడంతో లాస్య, అవినాష్ పై ఫైర్ అయ్యింది. తన విలన్ కూడా అవినాష్ అంటూ.. హౌజ్ లో మూడు పూటలు వండి పెడుతుంటే..అది కూడా పట్టించుకోకుండా నాకు అది చేయలేదు. ఇది చేయలేదు అంటావా? అని లాస్య తనలోని ఆగ్రహాన్ని బయటపెట్టింది. నామినేట్ చేసినందుకు అవినాష్ తనకు విలన్ అయ్యాడని క్లారిటీగా వివరణ ఇచ్చింది లాస్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X