బయటకు వస్తే చంపేస్తారు అభిజిత్ నిన్ను.. చివరలో ఎమోషనల్ అయిన మెహబూబ్

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నెవర్ బిఫోర్ అనేలా ఎండ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ క్లైమాక్స్ ను సెట్ చేసిన బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇక శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ను హౌజ్ లోకి పంపిన బిగ్ బాస్ ఒక డిఫరెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. ఇక మెహబూబ్ చేసిన కామెంట్స్, అలాగే ఎమోషనల్ అవ్వడం హైలెట్ గా నిలిచాయి.

బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఎలా ఉంటుందో..

బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఎలా ఉంటుందో..

బిగ్ బాస్ సీజన్ 4కు నేటితో ఎండ్ కార్డ్ పడనుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫీనలేలో విన్నర్ అయ్యేది ఎవరు అనే విషయంలో మరికొన్ని గంటల్లో క్లారిటి రానుంది. హౌజ్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లలో అభిజిత్, అఖిల్, సోహెల్ టైటిల్ విన్నర్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అభిజిత్ అని మొదటి నుంచి టాక్ వస్తున్నప్పటికీ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు కూడా చెప్పలేం బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో..

దివితో కలిసి మెహబూబ్ ఎంట్రీ

దివితో కలిసి మెహబూబ్ ఎంట్రీ

ఇక ఇటీవల హౌజ్ లో కంటెస్టెంట్స్ ను ఎక్కువగా ఆనందపరిచింది మాత్రం పాత కంటెస్టెంట్స్ ను మళ్ళీ రప్పించడం. వారితో సరదాగా మాట్లాడుతూ కొంత సేపటి వరకు అల్లరి చేయడం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మెహబూబ్ అయితే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. గ్లామరస్ గర్ల్ దివితో కలిసి హాట్ హాట్ స్టెప్పులతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు.

మెహబూబ్ ప్రజెంట్ చేసిన వీడియో..

మెహబూబ్ ప్రజెంట్ చేసిన వీడియో..

మెహబూబ్ రాకతో ఒక్కసారిగా సోహెల్ భావోద్వేగానికి గురయ్యాడు. అంతకు ముందే సుజాత, గంగవ్వ ఎంట్రీతోనే ఒక స్పెషల్ వీడియో వేశారు బిగ్ బాస్. సోహెల్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ మెహబూబ్ ఒక వీడియో ప్రజెంట్ చేశాడు. సోహెల్ స్స్నేహితులు అలాగే బ్రదర్ ఫాదర్ కూడా అందులో ఉండడంతో సోహెల్ ముందే భావోద్వేగానికి లోనయ్యాడు.

నేను కూడా ఫైనల్ లో ఉంటే..

నేను కూడా ఫైనల్ లో ఉంటే..

ఇక మెహబూబ్ దిల్ సే ఎంట్రీ ఇవ్వగానే సోహెల్ మరింత ఆనందానికి లోనయ్యాడు. కథ వేరే ఉంటది అంటూ ఇద్దరి గట్టిగా అరుస్తూ మాట్లాడుకున్నారు. అలాగే వారిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఏడ్చేశారు. నేను కూడా ఫైనల్ లో ఉంటే బావుండు అంటూ కంటతడి పెట్టుకున్నారు. అది కాస్త ఓవరాక్షన్ గా అనిపించింది.

బయటకు వస్తే చంపేస్తారు నిన్ను

బయటకు వస్తే చంపేస్తారు నిన్ను

ఇక అభిజిత్ గురించి చాల స్పెషల్ గా మాట్లాడాడు మెహబూబ్. నీ హవా మామూలుగా లేదు. బయటకు వస్తే చంపేస్తారు నిన్ను అమ్మాయిలు. అంత పిచ్చిగా అభిమానిస్తున్నారు. అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పిచ్చ పిచ్చగా పెరిగిపోయింది నీకు. చాలా బాగా అడుతున్నావ్ అంటూ నీ ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారని మెహబూబ్ వివరణ ఇవ్వడంతో నా బదులు నీ నెంబర్ ఇచ్చి నువ్వే మాట్లాడని సమాధానం చెప్పాడు అభిజిత్.

స్నేహితుల ఏడుపు.. ఆపండ్రా బాబు

స్నేహితుల ఏడుపు.. ఆపండ్రా బాబు

ఇక మెహబూబ్ వెళ్ళేటప్పుడు కూడా సోహెల్ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక వారి ఏడుపు చూసి అఖిల్ అయితే ఆపండ్రా బాబు అంటూ కామెంట్ చేశాడు. ఇక మెహబూబ్ వెళ్లిపోయిన తరువాత వాడు కూడా.. ఫైనల్స్ వరకు ఉండాల్సింది. నేను అఖిల్ వాడు ఫైనల్ వరకు ఉండాలని అనుకున్నాం అంటూ సోహెల్ అభిజిత్ తో చెప్పుకొని ఏడ్చాడు. ఇక నేడు ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X