నిజంగా ఇది వరస్ట్ సిచ్యువేషన్.. మాస్టర్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన మెహబూబ్
బిగ్ బాస్ సీజన్ 4 ఆదివారం ఎపిసోడ్ లో మాత్రం నాగార్జున ఇచ్చిన ట్విస్టుకు ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఈ సీజన్ లో ఎప్పుడు లేని విదంగా ఆల్ మోస్ట్ ఎలిమినెట్ అయ్యాడని అనుకున్న వ్యక్తిని సేవ్ చేశారు నాగార్జున. అమ్మా రాజశేఖర్, మెహబూబ్ ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ అమ్మా ఉండడం డౌట్ అని అనుకుంటుండగా.. సేవ్ అయిన విధానం షోకి మంచి హైప్ క్రియేట్ చేసింది.

హౌజ్ మెంట్స్ కి నచ్చని మాస్టర్
గడిచిన వారంలో అమ్మా రాజశేఖర్ ప్రవర్తన హౌజ్ మెంట్స్ కి నచ్చలేదనే చెప్పాలి. అరియానా, అవినాష్ లతో కొన్ని వివాధాలు వచ్చినప్పటికీ వాళ్ళు ఆయనకె సపోర్ట్ చేయగా మిగతా టీమ్ సభ్యులు మెహబూబ్ కి ఓటేశారు. ఒక విధంగా మెహబూబ్ పై అభిమానం కంటే మాస్టర్ పై ఎక్కువగా చూపించినట్లు అర్ధమయ్యింది. ఇక అదే మాస్టర్ ని మరింత బలపరిచింది.

వెక్కి వెక్కి ఏడ్చిన మెహబూబ్
అమ్మా రాజశేఖర్, మెహబూబ్ ని కాన్ఫెషన్ రూమ్ కి పిలిచినప్పుడు జరిగిన డ్రామా హౌజ్ లో ఒక కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇక నాగార్జున మెహబూబ్ సేవ్ అని చెప్పినప్పుడు మెహబూబ్ చాలానే ఏడ్చాడు. అమ్మా రాజశేఖర్ వెళ్లిపోవడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని హౌజ్ మెంట్స్ ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. నిజంగా ఇది వరస్ట్ సిచ్యువేషన్ అని అన్నాడు.

దారుణమైన సిచ్యువేషన్..
అమ్మా రాజశేఖర్, మెహబూబ్ మధ్యలో కూడా కొద్దిసేపటి వరకు ఎమోషనల్ మూమెంట్స్ నడిచాయి. హౌజ్ లో ఇదే తనకు అత్యంత దారుణమైన సిచ్యువేషన్ అని కొద్దీ సేపటి వరకు మెహబూబ్ మాత్రం కన్నీళ్లు ఆపలేదు. ఇక ఎప్పుడైతే అమ్మా సేవ్ అయ్యాడని చెప్పారో అప్పుడు అంధరికంటే ఎక్కువగా మెహబూబ్ సంతోషించాడు. నోయల్ బయటకు వెళ్లడంతో ఈ వారం ఎలిమినేషన్స్ లేదని క్లారిటీ ఇచ్చేశారు.

బోనస్ గా కెప్టెన్ పగ్గాలు
సేవ్ అవ్వడమే కుదరదు అనుకున్న సమయంలో అమ్మా రాజశేఖర్ కి దక్కింది మరో బోనస్ కెప్టెన్ పగ్గాలు. చాలా రోజులుగా కెప్టెన్ అవ్వాలని చూస్తున్న మాస్టర్ కి గత వారమే షాక్ తగిలింది. అప్పుడు కెప్టెన్ గా అయిన అరియానాపై ఇన్ డైరెక్ట్ గా కోపాన్ని చూపించారు. ఒక విధంగా మాస్టర్ కి అది మైనస్ అయినట్లు అనిపించింది. కానీ అందరు అతన్ని టార్గెట్ చేసినట్లు అనిపించడంతో అదే బలంగా మార్చుకున్నారు. ఇక నోయల్ వెళ్లిపోవడం కూడా మాస్టర్ కు కలిసి వచ్చింది.


Click it and Unblock the Notifications











