ఇంట్లో వాళ్ళ కోసం చదువును వదిలేసి.. ఆ పని చేశా: మోనాల్

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్స్ రోజుకో కలర్ లో కనిపిస్తున్నారు. ఛాన్స్ వస్తే చాలు ఎమోషనల్ విషయాలను బయటపెడుతున్నారు. ఇక మోనాల్ అయితే మొదలుపెడితే ఆపదు. కంటిన్యూగా కన్నీటి గాధలను బయటకు చెప్పేస్తోంది. అందరు కూడా విభిన్న రకాలుగా వారి పర్ఫెమెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా ట్రాక్ మార్చడం లేదు. ఇంతవరకు మోనాల్ ప్రేమ వ్యవహారం తప్పితే హైలెట్ అయ్యింది మరొకటి లేదనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఎవరికి తెలియని రహస్యాలు

ఎవరికి తెలియని రహస్యాలు

ఇక మోనాల్, అఖిల్ బయటకు వస్తే పెళ్లి చేసుకుంటారనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. ఆ విషయం పక్కన పెడితే 68వ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ వారి జీవితంలో ఎవరికి తెలియని ఒక రహస్యాన్ని చెప్పాలని బిగ్ బాస్ కోరగా అది వినే బాధ్యతను సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ కి అప్పజెప్పారు. అయితే వారు చెప్పిన సీక్రెట్స్ నిజాయితీగా అనిపిస్తే వారికి ఇంటి నుంచి వచ్చిన లెటర్స్ ని అందించే బాధ్యత కూడా అఖిల్ కి అప్పజెప్పారు బిగ్ బాస్.

అఖిల్ కు కనెక్ట్ అయ్యింది

అఖిల్ కు కనెక్ట్ అయ్యింది

మోనాల్ వంతు రావడంతో ఆమె తన జీవితంలోకి ఒక సందర్భం గురించి చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యింది. సాధారణంగానే మోనాల్ కన్నీళ్లతో షాక్ ఇస్తుంటుంది. ఇక తన ఫ్యామిలీకి సంబంధించిన విషయం కావడంతో ఆమె గుర్తు చేసుకొని మరి కొన్ని గంటల వరకు కన్నీళ్లతోనే ఉంది. మోనాల్ చెప్పిన సీక్రెట్ విషయం అఖిల్ కి కనెక్ట్ అయ్యింది. అందుకే ఆప్తుల నుంచి వచ్చిన లెటర్ ని ఆమెకు పంపాడు.

చిన్నవయసులోనే తండ్రి మరణించడంతో ..

చిన్నవయసులోనే తండ్రి మరణించడంతో ..

మోనాల్ ఏం చెప్పిందంటే.. చిన్నవయసులోనే తండ్రి మరణించడంతో ఆర్థికంగా ఫ్యామిలీ చాలా వెనుకబడిందని అయితే 12వ తరగతి అనంతరం జాబ్ చేయాల్సి వచ్చినట్లు చెప్పింది. ఒక బ్యాంక్ లోనే చిన్న ఉద్యోగం రావడంతో ఫ్యామిలీ కోసం డిగ్రీ కూడా చేయలేదు. ఇంకా చదువుకోవాలని ఉన్నా కూడా అలాంటి పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయాను అని వివరణ ఇచ్చింది.

Recommended Video

Bigg Boss Telugu 4: Monal Gajjar Cried నేషనల్ చానెల్.. అందరూ చూస్తుంటారు అంటూ బోరును ఏడ్చిన మోనాల్‌!
వారి సీక్రెట్స్ నమ్మేలా లేవు..

వారి సీక్రెట్స్ నమ్మేలా లేవు..

ఏడుస్తూనే చెప్పిన మోనాల్ అఖిల్ గుండెను గట్టిగానే తాకింది. ఇక ఆమె చెప్పిన సీక్రెట్ విషయం నమ్మకంగా అనిపించడంతో అఖిల్ ఆమె ఫ్యామిలి నుంచి వచ్చిన లెటర్ ని పంపాడు. ఇక హౌజ్ లో అందరి సీక్రెట్ విషయాల గురించి విన్న అఖిల్ అరియానా, అవినాష్ చెప్పిన సీక్రెట్ విషయాలు మాత్రం నమ్మేలా లేవని వారికి లేఖలు ఇవ్వలేదు. ఇక మిగతా వాళ్ల విషయంలో అనిమానం వ్యక్తం చేయకుండా అఖిల్ వారి లెటర్స్ వారికి అందేలా చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X