నాతో అలా చేస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి.. మరో Aతో మోనాల్ రొమాంటిక్ యాంగిల్
బిగ్ బాస్ హౌజ్ లో 40వ రోజు మసాలా డోస్ గట్టిగా దట్టించేశారు. కంటెస్టెంట్స్ లో రొమాంటిక్ డోస్ మరింత ఎక్కువయ్యింది. ఊహించని విధంగా ఒకరితో మరొకరు సంబంధం లేకుండా హాట్ స్టెప్పులతో రచ్చ రచ్చ చేశారు. ఈ వారం ఈ ఎపిసోడ్ తో కాస్త హైప్ ఎక్కువగానే క్రియేట్ చేశారు గాని టెలివిజన్ షోలో ఇలాంటి డోస్ ఇంకా పెంచితే మొదటికే మోసం వస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి.

అమ్మాయిలు బాగానే రెచ్చగొట్టరు
బిగ్ బాస్ షోకి మెల్లగా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతున్న సమయంలో కంటెస్టెంట్స్ రోజురోజుకు మసాలా డోస్ కాస్త ఎక్కువగానే యాడ్ చేస్తున్నారు. ఇక శుక్రవారం రోజు ఎవరు ఊహించని విధంగా అమ్మాయిలు అబ్బయిలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అరియానా అయితే అఖిల్ తో భార్యగా జీవించేసింది.

ముద్దు కావాలా? అంటూ అరియానా రచ్చ
ముద్దు కావాలా? సాయంత్రం మల్లెపూలతో రానా? సినిమా వెల్దామా అంటూ నానా రభస చేసింది. ఇక లుంగిలో ఉన్న సోహైల్ ని కూడా ముప్పుతిప్పలు పెట్టారు దివి, హారిక, అరియానా. అతని లుంగీ లాగేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఇక చివరలో లుంగీ డ్యాన్స్ అంటూ మంచి హైప్ క్రియేట్ చేసి లుంగిలో అమ్మాయిలా నడవాలి అంటూ సోహైల్ కి పెద్ద టాస్క్ ఇచ్చారు. అయినప్పటికీ సోహైల్ అందుకు న్యాయం చేశాడు.

అవినాష్ తో మోనాల్ హాట్ స్టెప్పులు
ఇక అందరిదీ ఒకలా ఉంటే మోనాల్ ఈ సారి ప్లాన్ చేంజ్ చేసింది. అఖిల్, అబిజిత్ రొటీన్ అయ్యారని అనుకుందో ఏమో గాని సడన్ గా మూడో A అవినాష్ దగ్గరకు వచ్చేసింది. ఎపిసోడ్ చివరలో అతనితో రొమాంటిక్ స్టెప్పులతో కౌగిలింతలతో ఒక్కసారిగా హీటెక్కించె ప్రయత్నం చేసింది. కూడా అవినాష్ మోనాల్ సపోర్ట్ చేయడంతో ఇంకాస్త స్ట్రాంగ్ గా తన మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
Recommended Video

నాతో ఇలా చేస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి?
ప్రియా..ప్రియా అంటూ డ్యాన్స్ నేర్చుకుంటూ అవినాష్ ని మోనల్ వాటేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అనంతరం నాతో ఇలా డ్యాన్స్ చేస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి? అంటూ మోనాల్ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడింది. అవినాష్ కూడా ఏ మాత్రం తగ్గకుండా కెమెరాలన్ని తనపై ఫోకస్ అయ్యేలా పర్ఫెమెన్స్ ఇచ్చాడు. మొత్తానికి ఎపిసోడ్ ఏండింగ్ లో అవినాష్, అబిజిత్ బాగానే ఆకట్టుకున్నారు కానీ మసాలా డోస్ మరీ ఎక్కువయ్యిందనే కామెంట్స్ కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











