లాస్య పుల్లలు పెడుతుందని ఊహించలేదు.. వీడియో చూసి షాకైన మోనాల్
బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ ఒక్కసారిగా హౌజ్ లో ఊహించని మలుపులను క్రియేట్ చేసింది. గతవారం గ్యాప్ ఇచ్చిన హోస్ట్ నాగార్జున ఈ సారి సరికొత్త ఎంట్రీతో అందరికి సర్ ప్రైజ్ ఇస్తూనే కొన్ని ట్విస్టులు కూడా ఇచ్చారు. కొందరి అసలు రంగులను బయటపెడుతూ సైలెంట్ అయ్యేలా చేశారు. ఒక్కొక్కరి వీడియోను బయటపెడుతూ ఫుల్ క్లారిటీ వచ్చేలా చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ లో ఒక కొత్త వాతావరణం క్రియేట్ అయ్యింది.

అభి వీడియోను బయటపెట్టిన నాగ్
అబిజిత్, మోనాల్ ఈ మధ్యలో కొంచెం కొంచెంగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అయితే సడన్ గా నాగ్ అభిజిత్ కి సంబంధించిన ఒక క్లిప్ ని చూపించి షాక్ ఇచ్చారు. మోనాల్ ని అభి చీటెడ్ అనే వీడియోను కూడా ప్లే చేశారు. గత వారం అభి, మోనాల్ నడకపై సెటైర్లు వేసిన విధానం అలాగే ఆమె ఒంటెలా ఉందని చెప్పిన వీడియోను కూడా ప్లే చేశారు. వాటిని చూసిన మోనాల్ షాక్ అయ్యింది.

లాస్య పుల్లలు పెట్టడం.. గుట్టు రట్టు
ఇక లాస్య పుల్లలు పెట్టడంపై కూడా మోనాల్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. నిజానికి లాస్య విషయంలో మోనాల్ నెగిటివ్ గా ఆలోచించలేదు. కానీ లాస్య మాత్రం అభిజిత్, మోనాల్ కలిసి ఉంటే సమయం దొరికినప్పుడల్లా పుల్లలు పెట్టె ప్రయత్నం చేస్తోందని అర్ధమయ్యింది. అభి, నోయల్, హారికలతో కలిసి ఉండే లాస్య వాళ్ళతో ముచ్చటించినప్పుడల్లా మోనాల్ పై సెటైర్లు వేసేది. ఆ వీడియోలను కూడా నాగ్ ప్లే చేసి గుట్టు బయటపెట్టాడు.

లాస్య ఇలా చేస్తుందని అనుకోలేదు
ఇక ఆ వీడియోలను చూసిన మోనాల్ కొన్ని సెకన్ల వరకు షాక్ లోనే ఉంది. ఇక వారిపై స్పందిస్తూ.. అందరి బెడ్ షీట్స్ మడతపెట్టి నీది ఎందుకు మడతపెట్టలేదని లాస్య అభికి చెప్పింది. కానీ నేను అలా చేస్తే అభికి కోపం వస్తుంది. అందుకే మానేశాను. కానీ లాస్య ఇలా పుల్లలు పెడుతుందని అనుకోలేదు. నోయల్ కూడా పైకి నవ్వుతూ పుల్లలు పెట్టడం గురించి ఇంతవరకు తనకు తెలియదు. అసలు విషయాలన్నీ కూడా ఇప్పుడే తెలిసాయని మోనాల్ వివరణ ఇచ్చింది.

అభిజిత్ కి నాగార్జున పంచ్
ఒక్కొక్కరిని మీ విలన్ ఎవరని అడిగే క్రమంలో నాగార్జున అభిజిత్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. తనను తాను అభి పులిలా ఊహించుకుంటున్న అభి మోనాల్ ని ఒంటె అని కూడా అన్నాడు. ఆ కామెంట్స్ పై స్పందించిన నాగ్.. నీకు జంతువులు అంటే చాలా ఇష్టం అనుకుంటా.. ఏదో ఒంటె, పులి అంటున్నావ్ అని నాగార్జున పంచ్ వేశారు. ఇక నీ విలన్ ఎవరని అడగ్గా.. అందరూ ఊహించినట్టుగానే అమ్మా రాజశేఖర్ అని అభి సమాధానం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











