Bigg Boss 4: ఒక కామెడీ పీస్ అరిస్తే నువ్ ఏడుస్తావా.. జబర్దస్త్ కమెడియన్‌కు కౌంటర్ ఇచ్చిన నాగార్జున
బిగ్ బాస్ హౌజ్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు ఒక రోజు తియ్యగా ఉండే నాగార్జున మరొక రోజు ఘాటుగా మారుతున్నారు. శనివారం తప్పులను పొరపాట్లను ఎత్తి చూపిస్తూ కంటెస్టెంట్స్ కి ఊహించని విధంగా షాక్ ఇస్తున్నారు. ఇక శనివారం ఎపిసోడ్ లో కూడా ఒకొక్కరికి మామూలుగా క్లాస్ పీకలేదు. ముఖ్యంగా కోప్పడిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా అవినాష్ కి కూడా సోహెల్ విషయంలో వార్నింగ్ ఇచ్చారు.
Recommended Video

అవినాష్, సోహైల్ కోల్డ్ వార్
ఇటీవల అవినాష్, సోహైల్ కి మధ్య గొడవలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా పిజికల్ టాస్క్ లలో అవినాష్, సోహైల్ కెప్టెన్ గా ఉన్న సమయంలో అతని ఆగ్రహాన్ని పరీక్షించాడు. హోటల్ టాస్క్ మొదలైనప్పటికి నుంచి కూడా సోహైల్ పై ఎక్కువగా అరుస్తున్నట్లు అర్ధమయ్యింది. ఇక ఇటీవల టాస్క్ లో కెప్టెన్ అయితే భయపడలా అంటూ సోహైల్ కోపాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నం చేశాడు. అందుకు సోహైల్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఏడ్చాడు కూడా.

ఎడవాల్సిన అవసరం కూడా లేదు
నాగార్జున సార్ కి ఎవరి మీద కొప్పడను అని మాట ఇచ్చాను అంటూ సోహైల్ గుర్తు చేసుకొని మరి ఏడ్చాడు. ఇక అదే విషయాన్ని ప్రస్తావించిన నాగార్జున అవినాష్ పై కౌంటర్ వేశాడు. సోహైల్ ని అభినందిస్తు.. నువ్ చెప్పాల్సిన విషయం డైరెక్ట్ గా చెప్పేసేయ్. మనసులో దాచుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఫ్రస్ట్రేషన్ తో ఎడవాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.

ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా?
అలాగే ఒక కామెడీ పీస్ (అవినాష్) అరిస్తే ఏడుస్తావా అంటూ నాగార్జున సోహైల్ కి మద్దతు ఇచ్చారు. ఇక అరియానాపై కూడా నాగార్జున సీరియస్ అయ్యారు. సోహైల్ సైలెంట్ గా ఉన్నాడు అనిపిస్తే నువ్వు కూడా అరిచేస్తావా? పొగరు అంటావా? అని నాగార్జున ఆమెకు కూడా క్లాస్ పీకారు. దీంతో వెంటనే అరియానా నాగార్జున మాటలకు సోహైల్ కి అందరిముందు క్షమాపణ చెప్పింది.

నువ్వు అరవాల్సిన అవసరం లేదు
ఇక అవినాష్ గురించి మాట్లాడిన నాగార్జున అతని కోపం పై కౌంటర్ వేస్తూనే క్లాస్ పీకారు. నీకు హౌజ్ లో మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ ఆఫ్ ది అవార్డు వచ్చింది. అయితే నీ కోపం నిజమైందేనా? లేక కామెడీగా చేస్తున్నావా? అని అడగడంతో అవినాష్ దివి, అఖిల్ లపై సాకులు చెప్పాడు. దీంతో వెంటనే నాగార్జున మరో కౌంటర్ ఇచ్చారు. సంచాలకుడిగా ఉన్న అఖిల్ మాట ఫైనల్.. దానికి నువ్వు అరవాల్సిన అవసరం లేదని నాగ్ అవినాష్ కి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











