బిగ్ బాస్4: మరో బాంబు పేల్చిన నాగార్జున.. నరాలు తెగే ఉత్కంఠలో అమ్మా రాజశేఖర్ కన్నీళ్లు
వీకెండ్ కి వచ్చేసరికి నాగార్జున ఒక్కసారిగా బిగ్ బాస్ పై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. శనివారం ఊహించని టాస్క్ లతో కంగారు పెడుతూ ఎలిమినేషన్స్ తో షాక్ ఇస్తున్నారు. ఇక ఆదివారం ఫన్ డే అంటూ కంటెస్టెంట్స్ కి బూస్ట్ ఇవ్వడమే కాకుండా జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇక ఈ శనివారం ఎపిసోడ్ లో ఊహించని విధంగా ఒక బాంబ్ పేల్చారు.
ఫినిష్ చేయని మరొక టాస్క్ ఉందంటూ షాక్ ఇచ్చారు.
Recommended Video

బాంబ్ పేల్చిన నాగార్జున
ఇటీవల బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా కొందరు కంటెస్టెంట్స్ జుట్టు కత్తిరించుకున్న విషయం తెలిసిందే. హారిక కూడా ఆ డేరింగ్ స్టెప్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే అప్పుడు కేవలం సగం జుట్టు మాత్రమే కత్తిరించుకోవాలి కాబట్టి పెద్దగా రిస్క్ అనిపించలేదు. కానీ ఇప్పుడు నాగార్జున అదే యాంగిల్ లో ఊహించని బాంబ్ పేల్చారు.

సగం గుండు..సగం మీసం..
నిలువుగా సగం గుండు తరహాలో హెయిర్ కట్ చేసుకోవాలని మీసాలు కూడా సగం కట్ చేసుకోవాలని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. నిజంగా ఆడియెన్స్ కి ఇది షాక్ ఇచ్చే టాస్క్ అనే చెప్పాలి. ఇక కంటెస్టెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని చెప్పవచ్చు. ఊహించని విధంగా అమ్మా రాజశేఖర్ మొదటిసారి డేరింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అలా చేస్తే ఎలిమినేషన్స్ లో లేనట్లే
నెక్స్ట్ వీక్ వరకు ఎలిమినేషన్స్ లో ఉండరని చెప్పడంతో నాగార్జున మాటలకు అమ్మా రాజశేఖర్ ఆ టాస్క్ ఫినిష్ చేయడానికి ఒప్పుకున్నాడు. బిగ్ బాస్ న్యూ ప్రోమోలో నరాలు ఉత్కంఠను కలిగించింది అంటే.. ఫుల్ ఎపిసోడ్ చూస్తే ఇంకా ఎలా ఉంటుందో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పిల్లాడి మాదిరిగా ఎడిచేశాడు..
ఇక అమ్మా రాజశేఖర్ కంటతడి పెట్టుకోవడం షాక్ ఇస్తోంది. నోయల్ ని ట్రిమ్మర్ తెమ్మని చెప్పిన నాగార్జున అమ్మా రాజశేఖర్ జుట్టును తీసేయ్యమని చెప్పాడు. అమ్మా రాజశేఖర్ కి తన హెయిర్ అంటే ఎంత ఇష్టమో హౌజ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక దీనంగా కెమెరా వైపు చూసిన అమ్మా ఆల్ మోస్ట్ చిన్న పిల్లాడి మాదిరిగా ఎడిచేశాడు. మరి నేడు జరగబోయే షోలో ఏమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











