అఖిల్ లైన్ క్లియర్.. అభిజిత్ విషయంలో హారిక హ్యాపీ, మళ్ళీ కొత్త లవ్ స్టార్ట్ కాబోతోందా?
బిగ్ బాస్ 4లో టాస్క్ లతో సంబంధం లేకుండా క్రియేట్ అవుతున్న వ్యవహారాలు బాగానే వైరల్ అవుతున్నాయి. మెయిన్ గా అఖిల్, మోనాల్, అభిజిత్ లవ ట్రాక్ రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఫైనల్ గా సోమవారం వీరి వ్యవహారంలో ఒక క్లారిటీ వచ్చినట్లు అర్ధమవుతోంది. నిజానికి మోనాల్ వ్యవహరిస్తున్న తీరుకు మధ్యలో అఖిల్, అభిజిత్ కంటెస్టెంట్స్ గా కాకుండా మోనాల్ మ్యాటర్ వల్ల శత్రువులుగా మారారు. ఇక నిన్న అభిజిత్ చాలా క్లారిటీగా చెప్పడంతో కొత్త జర్నీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

కుండ బద్దలు కొట్టిన అభిజిత్
మోనాల్ మొదటి నుంచి కూడా అపరిచితుడు రేంజ్ లో క్యారెక్టర్స్ మరుస్తోందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఓ వైపు అఖిల్ తో ప్రేమగా మాట్లాడుతూనే మరోవైపు అభిజిత్ తో ఉండడానికి ఇష్టపడుతోంది. ఇక అఖిల్, అభిజిత్ ఆ విషయంలో గోడవపడుతుంటే తన గురించి ఇంత గొడవ చేయడం అవసరమా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ప్రతీ సారి ఇది రొటీన్ అవ్వడంతో అభిజిత్ కుండ బద్దలు కొట్టేశాడు.

నోయేల్ సెటిల్మెంట్..
మోనాల్, అభిజిత్ వాగ్వివాదం అనంతరం మోనాల్ కొంత అస్వస్థతకు గురవ్వడంతో నోయేల్ మధ్యలో ఉండి సెటిల్మెంట్ చేయాలని అనుకున్నాడు. ఈ రోజు నుంచి మీరు ఒక కొత్త ఫ్రెండ్స్ లా ఉండండి. గొడవలు పడుతూ మనసులను గాయపరచుకోవడం ఎందుకు, ఇప్పటి నుంచే కొత్త జర్నీ స్టార్ట్ చేయండని కొన్ని మంచి మాటలు చెప్పడంతో అఖిల్ కూడా చాలా క్లియర్ గా వివరణ ఇచ్చేశాడు.

కామెడీ అవ్వడం ఇష్టం లేదు
మనతో ఇబ్బంది ఉన్నప్పుడు కట్ చేయడమే బెటర్. ని హ్యాపీనెస్ నీది, నా సంతోషం నాది అంటూ మోనాల్ కి డైరెక్ట్ గా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన అభిజిత్ ఇక నుంచి మధ్యలో నేను కామెడీ అవ్వడం ఇష్టం లేదని కూడా అన్నాడు. ఇక మోనాల్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అలానే చూస్తూ ఉండిపోయింది. కానీ అభిజిత్ ని మాత్రం ఆమె రిజెక్ట్ చేయలేకపోయింది.

అఖిల్ లైన్ క్లియర్ అయ్యింది..కానీ..
ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఒక క్లారిటీ వచ్చిన తరువాత అఖిల్ లైన్ క్లియర్ అయ్యింది కానీ ఇప్పుడు మోనాల్ పై అతనికి కూడా కోపం ఉంది. అఖిల్ కూడా అభిజిత్ తరహలోనే ఆలోచిస్తున్నట్లు స్పేషల్ గా చెప్పనవసరం లేదు. తనకు కూడా జోకర్ అవ్వాలని ఇష్టం లేదని మొదటి నుంచి చెబుతూనే వస్తున్నాడు. ఇక నిన్న నామినేషన్ ప్రక్రియలో అభిజిత్ పై చేసిన కామెంట్స్ తో గట్టి రివెంజ్ మీద ఉన్నట్లు అర్ధమయ్యింది.
Recommended Video

హారికతో మరో కొత్త లవ్ స్టోరీ
ఇక బిగ్ బాస్ షోలో లవ్ స్టొరీ లేకపోతే కూరలో కారం లేనట్లే అనే విషయం బిగ్ బాస్ నిర్వాహకులకు బాగా తెలుసు. ఇక త్వరలోనే అభిజిత్, హారిక మధ్య అసలైన లవ్ ట్రాక్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్నిసార్లు అభిజిత్ పై హారిక ఇన్ డైరెక్ట్ గా తన ఇష్టాన్ని చూపించింది. అఖిల్ కూడా ఆమెతో పలు సందర్భాల్లో క్లోజ్ గా ఉన్నాడు. హోటల్ టాస్క్ లోనే ఈ జోడి బావుందని నెటిజన్స్ నుంచి పాజిటీవ్ కామెంట్స్ వచ్చాయి. మరీ ఈ వారం ఎలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











