బిగ్ బాస్ 4: మరో కొత్త టాస్క్‌లో న్యూ ట్విస్ట్.. మధ్యలోనే కింద పడిపోయిన అవినాష్
బిగ్ బాస్ హౌజ్ లో టాస్క్ అనేది వారానికొక ట్విస్ట్ ఇస్తోంది. అలాగే రోజులు గడుస్తున్న కొద్దీ టాస్క్ ల డోస్ కూడా ఎక్కువవుతోంది. ఫిజికల్ టాస్క్ లలో బిగ్ బాస్ క్రియేట్ చేస్తున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. ఎలాంటి దాంట్లో అయినా కొందరు ఊహించని విధంగా గాయపడుతున్నాడు. ఇక నేటి ఎపిసోడ్ లో "రేసర్ ఆఫ్ ద హౌజ్" అనే టాస్క్ లో అవినాష్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది.

ముదురుతున్న వివాదాలు..
గురువారం ఎపిసోడ్ లో ఎక్కువగా ఎమోషనల్ కాన్సెప్ట్ హైలెట్ గా నిలిచింది. లాస్య, హారిక, అరియానా వారి ఎమోషనల్ మూమెంట్స్ గురించి చెబుతూ ఒక్కసారిగా హౌజ్ లో వాతావరణాన్ని చేంజ్ చేశారు. అలాగే అవినాష్, సోహెల్ కి మధ్య రోజురోజుకు వివాధాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఇక నేటి ఎపిసోడ్ లో అవినాష్ భారీ టాస్క్ ను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

రేసర్ ఆఫ్ ది హౌజ్ ఎవరు?
శుక్రవారం రేసర్ ఆఫ్ ది హౌజ్ అనే టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ మొదట అవినాష్, మెహబూబ్, అఖిల్ ని పోటీలోకి దింపారు. దాదాపు పోలీస్ అకాడమీలో ఉన్న శిక్షణ మాదిరిగా టాస్క్ లను పూర్తి చేయాల్సి వచ్చింది. మెహబూబ్ అయితే చాలా పవర్ఫుల్ గా పోటీలో తన బలాన్ని చూపించాడు. ప్రతి ఒక్క దాన్ని రిస్క్ తో పూర్తి చేసుకుంటూ అందరిలో టెన్షన్ క్రియేట్ చేశారు.

టాస్క్ లో అఖిల్.. గట్టిగా అరిచేసిన మోనాల్
ఇక అఖిల్ టాస్క్ ను మొదలుపెట్టగానే మోనాల్ కంగారు పడినట్లు అర్ధమయ్యింది. జాగ్రత్త జాగ్రత్త అంటూ అరుస్తూ అఖిల్ లో బలాన్ని నింపే ప్రయత్నం చేసింది. గతంలో జరిగిన టాస్క్ లలో కూడా చాలా వరకు ఆమె అఖిల్ కి మద్దతుగా నిలిచింది. అలాగే అభిజిత్ పై కూడా అప్పుడప్పుడు ప్రేమను చూపిస్తోంది.
Recommended Video
మధ్యలోనే పడిపోయిన అవినాష్
ఇక శుక్రవారం ఇచ్చిన రేసర్ ఆఫ్ ది హౌజ్ టాస్క్ లో అవినాష్ మధ్యలోనే కింద పడిపోయాడు. చూస్తుంటే గాయపడినట్లు తెలుస్తోంది. అవినాష్ కింద పడడంతో ఒక్కసారిగా హౌజ్ మెంట్స్ షాక్ అయ్యారు. అమ్మాయిలైతే గట్టిగా అరిచేశారు. ఇక టాస్క్ లలో ఎవరు వగెలుస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం ఎపిసోడ్ తో ఒక న్యూస్ ట్విస్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











