అమ్మా రాజశేఖర్ టార్గెట్ అయ్యాడా.. మళ్ళీ ఈ సారి కూడా మోసమేనా?
బిగ్ బాస్ సీజన్ 4పై ఈ సారి ఎవరు ఉహీంచని విధంగా విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా ఎలిమినేషన్స్. విషయంలో జనాలు పెదవి విరుస్తున్నారు. షో మొదలైనప్పటి నుంచి కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ విషయంలో రేటింగ్ పరంగానే ఆలోచిస్తున్నారనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మరోవైపు పాలిటిక్స్ కూడా జరుగుతున్నట్లు టాక్ వస్తోంది.

కావాలనే బయటకు పంపిస్తున్నారు
మొదట ఎలిమినెట్ అయిన డైరెక్టర్ సూర్య కిరణ్ తప్పితే చాలా వరకు మిగతావారంతా కూడా ఎలిమినేషన్ ప్రక్రియపై వేలెత్తి చూపినవారే. నాకు ఓట్లు బాగానే వచ్చాయి. కానీ ఎక్కడో ఎదో మోసం జరిగిందని కూడా చెబుతున్నారు. బయటకు వచ్చిన తరువాత నన్ను కావాలనే హౌజ్ లో నుంచి పంపించేశారని చెబుతుండడంతో షోపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

కుట్రపూరితంగా నామినేషన్
ఇటీవల కుమార్ సాయి విషయంలో కూడా చాలా మోసం జరిగిందని బిగ్ బాస్ పై ట్రోలింగ్ అయితే గట్టిగా వచ్చింది. ఇక హౌజ్ లో కంటెస్టెంట్స్ కూడా కుట్రపూరితంగానే అతన్ని మాత్రమే టార్గెట్ చేశారని ఒక క్లారిటీ అయితే వచ్చింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ద్వారా అతను మధ్యలో రావడంతో ఎవరు కూడా అతనికి కనెక్ట్ కాలేకపోయారు. ఇక నామినేషన్ ప్రక్రియలో అతన్ని ఈజీగా సెలెక్ట్ చేసుకున్నారు.

టార్గెట్.. అమ్మా రాజశేఖర్
నామినేట్ చేయాలి అంటే ఎదో ఒక కారణం ఉండాలి కాబట్టి కుమార్ సాయి విషయంలో కంటెస్టెంట్స్ కావాలని గొడవలు పెట్టుకున్నట్లు అర్ధమయ్యింది. ఇక ఇప్పుడు అమ్మా రాజశేఖర్ విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు టాక్ వస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో అఖిల్, లాస్య కూడా అమ్మా రాజశేఖర్ ని నామినేట్ చేయడంతో సీన్ అర్ధమయ్యింది.
Recommended Video

వాళ్ళు కూడా అతన్నే టార్గెట్ చేయడంతో
ఈ సారి కన్నింగ్ స్మైల్ సాకుతో లాస్య అమ్మాను టార్గెట్ చేసింది..హోటల్ టాస్క్ లో ఎక్కువగా అమ్మా, లాస్యలే ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకున్నారు. కానీ ఆయన మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడతాడాని అనే కారణాన్ని హైలెట్ చేసింది లాస్య. ఇక మోనాల్ విషయంలో అమ్మా రాజశేఖర్, అఖిల్ మధ్య హాట్ హాట్ డిస్కషన్ ఎక్కువగా నడిచింది. అఖిల్ తో పాటు సోహైల్, అబిజిత్, కూడా అమ్మానే టార్గెట్ చేయడంతో అతనే ఈ సారి వెళ్లిపోవచ్చని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











