ఒక్కరోజైనా నిజాయితీగా ఉండు.. ఇప్పుడు రా తేల్చుకుందాం.. నోయల్, కుమార్ సిల్లీ లొల్లీ
బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు సర్వసాధారణమని అందరికి తెలిసిన విషయమే. ఫిజికల్ టాస్క్ లు వస్తే చాలు వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఎవరికి వారు.. వారి మాటే నెగ్గాలని ఊహించని విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 40వ ఎపిసోడ్ లో అందరిది ఒక గొడవలా అనిపిస్తే నోయల్, కుమార్ సాయిల మధ్య జరిగిన వివాదం మాత్రం చాలా సిల్లీగా అనిపించిందనే కామెంట్స్ వస్తున్నాయి.

అమ్మాయిలతో పాటు అవినాష్ కూడా..
రేసర్ ఆఫ్ ది హౌజ్ టాస్క్ లో భాగంగా అమ్మయిలు అబ్బాయిలు ఫస్ట్ రౌండ్ లో పాల్గొన్నారు. పుష్ అప్ లు చేయాలని చెప్పడంతో మొదటి రౌండ్ లో అమ్మయిలంతా ఔట్ అయ్యారు. వారితో పాటు అవునాష్ కూడా ముందే ఔట్ అయ్యాడు. ఇక కుమార్ సాయి, మెహబూబ్, అఖిల్ పోటాపోటీగా పాల్గొని రెండో రౌండ్ కి వెళ్లారు.

ఒక్కరోజైనా నిజం మాట్లాడతావాని అనుకున్నా..
ఇక అందరితో మరో గొడవ అయితే కుమార్ సాయి పుష్ అప్ లు సరిగ్గా చేయలేదంటూ నోయల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నోయల్ గతంలో ఎప్పుడు లేని విధంగా కుమార్ తో గొడవ పడటం హాట్ టాపిక్ గా మారింది. ఒక్కరోజైనా నిజం మాట్లాడతావాని అనుకున్నా అంటూ నోయల్ సెటైర్ వేయడంతో కుమార్ కూడా అదే తరహాలో మాటల డోస్ పెంచాడు.

ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార్ సాయి
సరే.. ఇప్పుడు రా.. మన ఇద్దరం కలిసి చేద్దాం.. నువ్వు ఎన్ని తీస్తావో..నేను ఎన్ని చేస్తానో తెలిపోతుంది.. అంటూ కుమార్ సాయి ఫైర్ అయ్యాడు. ఇక సంచాలకుడిగా ఉన్న అమ్మా రాజశేఖర్ ని సరైన న్యాయం చెప్పాలని కోరగా అందుకు ఆయన నోయల్ కు మద్దతుగా మాట్లాడుతూ అవును ఒక్కసారి ఆగిపోయినట్లు అనిపించిందని ఆన్సర్ ఇచ్చాడు.
Recommended Video

నువ్వు ఆ ఫీలింగ్ తోనే బతుకుతున్నావ్..
ఇక నోయల్ తన మాటల డోస్ లు ఇంకాస్త పెంచే ప్రయత్నం చేశాడు. ఒక్కరోజైనా నిజాయితీగా ఉండు అంటూ కామెంట్ చేయడంతో మాటకు మాట పెరిగింది. నిదే తప్పుడు స్టేట్మెంట్.. నీలాగా ఆలోచించకుండా మాట్లాడే బుద్ధి నాకు లేదని కుమార్ చెప్పిన మాటకు.. నువ్వు ఆ ఫీలింగ్ తోనే బతుకుతున్నావ్ అంటూ నోయల్ కూడా కౌంటర్ ఇచ్చాడు. అంతే కాకుండా సోదరా అంటావ్ కానీ నీలో అది ఉండదని కూడా అనడంతో హౌజ్ లో వీరి వివాదం సిల్లీగా అనిపించిందనే కామెంట్స్ వచ్చాయి.నువ్వు ఆ ఫీలింగ్ తోనే బతుకుతున్నావ్..
ఇక నోయల్ తన మాటల డోస్ లు ఇంకాస్త పెంచే ప్రయత్నం చేశాడు. ఒక్కరోజైనా నిజాయితీగా ఉండు అంటూ కామెంట్ చేయడంతో మాటకు మాట పెరిగింది. నిదే తప్పుడు స్టేట్మెంట్.. నీలాగా ఆలోచించకుండా మాట్లాడే బుద్ధి నాకు లేదని కుమార్ చెప్పిన మాటకు.. నువ్వు ఆ ఫీలింగ్ తోనే బతుకుతున్నావ్ అంటూ నోయల్ కూడా కౌంటర్ ఇచ్చాడు. అంతే కాకుండా సోదరా అంటావ్ కానీ నీలో అది ఉండదని కూడా అనడంతో హౌజ్ లో వీరి వివాదం సిల్లీగా అనిపించిందనే కామెంట్స్ వచ్చాయి.


Click it and Unblock the Notifications











