నొప్పితో బాధపడుతుంటే చిల్లర కామెడీ చేస్తావా? అవినాష్, మాస్టర్‌లను కడిగిపారేసిన నోయల్

బిగ్ బాస్ హౌజ్ లో ఎవరు ఎలా ఉన్నా కూడా నోయల్ మాత్రం చాలా సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చాడనే చెప్పాలి. కోపం లేకుండా చాలా కూల్ గా అందరితో ఫ్రెండ్లిగా ఉండడానికి ట్రై చేశాడు. టాస్క్ లలో భాగంగా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు తప్పితే చాలా వరకు నోయల్ మిగతా విషయాలలో జెన్యున్ గా ఉండడానికి ట్రై చేశారు. అయితే సడన్ గా ఇంటి నుంచి బయటకు వెళుతుండగా తన మనసులో ఉన్న అసలు విషయాలను, కాస్త కోపాన్ని బయటపెట్టాడు.

దిమ్మతిరిగేలా కౌంటర్లు

దిమ్మతిరిగేలా కౌంటర్లు

లెగ్ పెయిన్స్ వలన హౌజ్ నుంచి నిష్క్రమించిన నోయల్ వెళుతూ వెళుతూ తన మనసులో ఉన్న ఆవేదనను, ప్రేమను, కోపాన్ని ఒకేసారి చూపించాడు. అమ్మా రాజశేఖర్, అవినాష్ లకు ఊహించని విధంగా దిమ్మతిరిగేలా కౌంటర్లు కూడా ఇచ్చాడు. అవినాష్, నోయల్ మాటలను తట్టుకోలేక కాస్త అసంతృప్తికి లోనయ్యాడు. కావాలనే బ్యాడ్ చేస్తున్నవాని కూడా అన్నారు.

వెయ్యి రేట్లు నొప్పిని భరించాను

వెయ్యి రేట్లు నొప్పిని భరించాను

నోయల్ మాట్లాడుతూ.. అవినాష్, మాస్టర్ ఓంటి కాలిపై నిలబడ్డారు కదా చాలా నొప్పిగా ఉంది కదు. దానికంటే వెయ్యి రేట్లు నొప్పిని నేను భరించాను. నాకున్న వ్యాధి కారణంగా ఉదయమే నా కాళ్ళను సరి చేసుకుంటూ ఉంటాను. దాన్ని కూడా మీరు హేళన చేశారు. ఎన్నో కోట్ల మంది షోను చూస్తున్నారు. ఒకరి బాధపై కూడా జోకులు వేయడం ఏమిటని ప్రశ్నించారు నోయల్.

నీ చిల్లర కామెడీ ఏంటి?

నీ చిల్లర కామెడీ ఏంటి?

అదే విధంగా అవినాష్ తన నడకను కూడా ఇమిటేట్ చేస్తూ హేళన చేశాడని చెప్పిన నోయల్.. నీ చిల్లర కామెడీ ఏంటి? నువ్వు జోకరా? ఒక మనిషి బాధను అలా వెక్కిరించవద్దని అన్నాడు. అలాగే ఒక బిగ్ బాస్ హౌజ్ లో హింస చేయరాదనే ఒక రూల్ ఉందని, శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బాధపెట్టవద్దని అన్నాడు.

ఆ బాధ గురించి నాకు తెలుసు

ఆ బాధ గురించి నాకు తెలుసు

అవినాష్ నీకు నేను ఎంతో సహాయం చేశా. నీ కాలికి దెబ్బ తగిలినప్పుడు నేను వచ్చి కట్టు కట్టాను. ఎందుకంటే ఆ బాధ గురించి నాకు తెలుసు. కానీ నేను బాధపడుతుంటే మీరు మాత్రం హేళన చేశారు. నువ్వు నన్ను టెంపరరీ ఫ్రెండ్ అని అన్నావని.. నోయల్ తన మనసులో ఉన్న ఆవేదనని మొత్తం బయటపెట్టేశాడు.

కావాలని మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావ్

కావాలని మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావ్

ఇక సహనం కోల్పోయిన మాస్టర్, అవినాష్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. కావాలని మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావ్. నిన్ను ఇమిటేట్ చేస్తున్నప్పుడు నవ్వి.. ఇప్పుడు తప్పని అంటున్నావ్. నువ్వు చేస్తే రైట్.. మేము చేస్తే తప్పా.. అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక అవినాష్ అయితే చిల్లరకామెడి అంటావా? కామెడీ చేస్తే తప్పా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఎండ్ కార్డ్ పెట్టిన నాగార్జున

ఎండ్ కార్డ్ పెట్టిన నాగార్జున

ఇక నోయల్, అవినాష్ ల మధ్య మాటల డోస్ ఎక్కువవుతున్న తరుణంలో నాగార్జున కలుగజేసుకొని కూల్ చేసే ప్రయత్నం చేశారు. హౌజ్ నుంచి బయటకు వెళ్ళే వారు వాళ్ళలో ఉన్న ఫీలింగ్ ని బయటకు చెప్పడం సహజమని అందులో నిజం ఉంటే తీసుకోండి లేదంటే లేదని నాగ్ గోడవకు ఎండ్ కార్డ్ పెట్టారు. ఇక నోయల్ ఎలిమినేషన్స్ లో ఉన్న వారిలో లాస్యను సేవ్ చేసి అందరికి గుడ్ బై చెప్పేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X