ఘాటైన మిర్చి దండలతో నామినేషన్ ప్రక్రియ, ఒక్కొక్కరికి మామూలుగా మండడం లేదు
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు మొత్తానికి 5వ వారం ఎలిమినేషన్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. గత నాలుగు వారాల నుంచి చూసుకుంటే హౌజ్ లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. ఇక కంటెస్టెంట్స్ మధ్య గొడవల డోస్ కూడా రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇక ఆరవ వారం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ ఊహించని విధంగా ప్లాన్ వేశాడు. ఈ ప్రక్రియ నెవర్ బిఫోర్ అనేలా ఘాటెక్కిస్తోంది.

గోడవల ఘాటు మరింత ఎక్కువయ్యేలా
ఘాటుగా ఉండే ఎండు మిర్చి దండలను సిద్ధం చేసి ఉంచిన బిగ్ బాస్ నిర్వాహకులు నామినేషన్ ప్రక్రియలో వాటిని కీలకంగా మార్చడమే కాకుండా కంటెస్టెంట్స్ మధ్య గోడవల ఘాటు కూడా మరింత ఎక్కువయ్యేలా చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు కానుందని టీజర్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చేశారు.

బుక్కయ్యింది అతడే..
ఇప్పటికే కెప్టెన్ గా అధికారాలు అందుకున్న సోహెల్ ఈ వారం కూడా సేఫ్ జోన్ లోకి వచ్చినట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారం కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ ప్రక్రియలో ఎక్కువగా మెహబూబ్ బుక్కయినట్లు తెలుస్తోంది. గతవారం హోటల్ టాస్క్ లో అతను చేసిన రచ్చకు రివెంజ్ తీర్చుకోవాలని హోటల్ సిబ్బందిగా ఉన్న కంటెస్టెంట్స్ కసి మీద ఉన్నట్లు ఈజీగా అర్ధమయ్యింది.

హారిక మీద కుమార్ సాయి రివెంజ్
అభిజిత్ తో పాటు మోనాల్ కూడా మిర్చి దండను అతనికె వేశారు. ఇక రెండు మూడు ఉన్నా కూడా హరికకే వేస్తాను అంటూ కుమార్ సాయి తన రివెంజ్ ని బయటపెట్టాడు. గత కొన్ని రోజులుగా తనను అందరూ టార్గెట్ చేస్తున్నారని ముఖ్యంగా హారిక అంటూ కుమార్ సాయి చెబుతున్న విషయం తెలిసిందే. కానీ హారిక మాత్రం మిమ్మలి ఎవరు టార్గెట్ చేయడం లేదని సమాధానం ఇచ్చింది.

మరోసారి ఎడ్చేసిన మోనాల్.. అభిజిత్ ఫ్లైయింగ్ కిస్
ఇక మరోసారి మోనాల్ ఎప్పటిలానే కంటతడి పెడుతూ తన గురించీ ఎవరు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా సమస్యలను నేను పరిష్కరించుకోగలనని ఏడుస్తూ చెప్పింది. ఇక అభిజిత్ కూడా ఫ్లైయింగ్ కిస్ తో సమాధానం చెప్పినట్లు అర్ధమవుతోంది. ఇక మరోవైపు అఖిల్, అభిజిత్ ఒకరిపై మరొకరు మిర్చి దండలను వేసుకున్నారు. ఇక అఖిల్, అభిజిత్ గత లోపాలను గుర్తు చేస్తూ వరస్ట్ అంటూ కామెంట్ చేశాడు. అదే తరహాలో అభి కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Recommended Video

వేలు దించి మాట్లాడు.. సోహెల్ వార్నింగ్
ఇక దివి గతంలో జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటూ దెబ్బలు తగిలించుకోవడానికి ఇక్కడికి రాలేదు అంటూ కంటెస్టెంట్స్ పై ఫైర్ అయ్యింది. ఇక మోనల్ దండ వేస్తుంటే ఆమె అసహనంతో తెంచి వేసింది. ఇక అరియానా, మెహబూబ్ మధ్య మరోసారి ఘాటు మాటలు హీటెక్కించాయి. ప్రతిసారి నిన్ను నామినేట్ చేస్తే రివర్స్ లో నామినేట్ చేస్తారంతే.. అంటూ ఫైర్ అవ్వగా మెహబూబ్ కూడా నీదే తప్పు అంటూ ఆమెను నామినేట్ చేశాడు. ఇక సోహెల్ కి కూడా కుమార్ సాయి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వేలు దించి మాట్లాడు అంటూ సోహెల్ కుమార్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడు. చూస్తుంటే ఈ రోజు షోలో నామినేషన్ ప్రక్రియ హౌజ్ లో ఒక న్యూ వైబ్రేషన్ క్రియేట్ చేసేలా ఉందని అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











