పుడింగిలా ఫీల్ అయిపోకు..అలా చేయొద్దని చెప్పడానికి నువ్ ఎవడివి?: అభి vs అవినాష్

బిగ్ బాస్ షోలో వారంలో ఆరు రోజులు ఒకలా ఉంటే సోమవారం మాత్రం మరోలా ఉంటుంది. నామినేషన్స్ మొదలయ్యాయి అంటే చాలు ఎక్కడ లేని కోపాలు అసలు రంగులు బయటకు వస్తాయి. ఇక బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ లో మాత్రం గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ మధ్య అనుకోని వివాదాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్స్ లో భాగంగా అబిజిత్, అవినాష్..ఆగ్రహంతో వారి లూప్ హోల్స్ ని బయట పెట్టుకున్నారు.

కోపంతో పరిగెత్తిన అఖిల్

కోపంతో పరిగెత్తిన అఖిల్

మొదట అరియానా, సోహైల్ మధ్య చోటుచేసుకున్న గోడవ హౌజ్ లో బీభత్సం క్రియేట్ చేసింది. ఇక కెప్టెన్ అరియానా మరోసారి తన ఓవరాక్షన్ పెర్ఫెమెన్స్ తో సోహైల్ కోపాన్ని పరీక్షించింది. ఎక్కువసేపు నిద్ర పోయినందుకు మరోసారి స్నానం చేయాలని అనడంతో సాయంత్రం చేస్తానని చెప్పినప్పటికీ అరియానా వినకుండా సోహైల్ ని విసిగించింది. దీంతో కోపంతో పరిగెత్తుకుంటు స్విమ్మింగ్ ఫూల్ లోకి దుకేశాడు.

పుడింగిలా ఫీల్ అయిపోకు

పుడింగిలా ఫీల్ అయిపోకు

గోడవ తీవ్రంగా మారినట్లు అవినాష్, మాస్టర్ కలుగజేసుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు గాని వర్కౌట్ కాలేదు. ఇక ఆ తరువాత నామినేషన్స్ లలో ఒకరిపై మరొకరు గుడ్డు పగలగొట్టాలని బిగ్ బాస్ చెప్పడంతో సోహైల్ మరోసారి తన కోపాన్ని చూపించాడు. అరియానా అతనిపై గుడ్డు పగలగొట్టి నామినేట్ చేసింది. దీంతో సోహైల్ మాట్లాడుతూ.. నీలా ఎవరూ చేయలేదు.. నీ యాటిట్యూడ్ చూపించకు.. నువ్ పెద్ద పుడింగిలా ఫీల్ అయిపోకు అంటూ కంట్రోల్ తప్పాడు సొహైల్.

అభిజిత్ vs అవినాష్

అభిజిత్ vs అవినాష్

ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు అబిజిత్, అవినాష్ గొడవ. ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. కానీ కామెడీ విషయంలో గొడవలు పెరిగాయి. ముందుగా అవినాష్ అభిని నామినేట్ చేస్తూ.. నోయల్ నాది చిల్లర కామెడీ అంటూ పర్సనల్‌గా నన్ను టార్గెట్ చేసినప్పుడు మీరు ఇన్వాల్వ్ కావడం సరైనది కాదని చెబుతూ గుడ్డు కొట్టేశాడు.

కామెడీ ఆపేస్తే బాగుంటుంది

కామెడీ ఆపేస్తే బాగుంటుంది

ఇక అభిజిత్ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు. అవినాష్‌ని నామినేట్ చేస్తూ.. హెల్దీగా ఎంటర్ టైన్మెంట్ చేస్తా అంటావు గాని అది నాకు అలా అనిపించదు. నువ్ ఇక్కడికి కామెడీ చేయడానికి వచ్చినా.. అది మేం కామెడీతీసుకోవడానికి సిద్ధంగా లేమని.. కొంచెం ఓవర్ గా చేస్తున్న కామెడీ ఆపేస్తే బాగుంటుందని అన్నారు అభి.

కామెడీ చేయొద్దని చెప్పడానికి నువ్ ఎవడివి?

కామెడీ చేయొద్దని చెప్పడానికి నువ్ ఎవడివి?

ఇక అవినాష్ సమాధానం ఇస్తూ.. నేను కామెడీ చేయడానికే వచ్చా. పక్కా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే తీరుతాను. ప్రాణం పోయే వరకూ పెర్ఫామెన్స్ చేస్తా.. నువ్వు ఆ విషయంలో చేయకుండా కూర్చుంటావ్.. నన్ను కామెడీ చేయొద్దని చెప్పడానికి నువ్ ఎవడివి? అంటూ అభికీ హెచ్చరిక జారీ చేశాడు అవినాష్. ఆ విధంగా వారి మధ్య నామినేషన్ ప్రక్రియ ఒక్కసారిగా హౌజ్ ని హీటెక్కించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X