మరోసారి టార్గెట్ అయిన అమ్మా రాజశేఖర్.. ఇక ఆయన భవిష్యత్తు ఆడియెన్స్ చేతుల్లోనే..
అమ్మా రాజశేఖర్ షో మొదటి నుంచి కూడా వీలైనంత వరకు సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నం చేశారు. అయితే అక్కడక్కడా అయన చేసిన పొరపాట్లు మైనస్ అయ్యాయి. ముఖ్యంగా టాస్క్ లలో ఆయన కొన్ని సార్లు సడన్ గా హైపర్ కి గురవ్వడం ఆడియెన్స్ కి కూడా నచ్చేది కాదు. ఇక రాను రాను మాస్టర్ తన ప్లాన్ ని కాస్త చేంజ్ చేయడం కలిసొచ్చింది. ఏదైనా మాట్లాడితే ఎదుటివాళ్ళు కూడా సమాధానం చెప్పడానికి వీలు లేకుండా కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు అర్ధమయ్యింది.

అంతకుమించి పెర్ఫామెన్స్ ఇస్తున్న మాస్టర్
గత వారం నామినేషన్స్ లలో భాగంగా ఆల్ మోస్ట్ లగేజ్ సర్దుకొని వెళ్లిపోవడానికి సిద్దమైన అమ్మా రాజశేఖర్ చివరి నిమిషంలో సేవ్ అయ్యారు. నోయల్ బయటకు వెళ్లిపోవడం ఆయనకి కలిసొచ్చింది. అందుకే ఆ వారం ఎలిమినేషన్ లేకుండా కానిచ్చేశారు. సేవ్ అయిన తరువాత ఒక కంటెస్టెంట్ వేసే అడుగులు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరు. అయితే మాస్టర్ మాత్రం అంతకు మించి అనేలా అడుగులు వేస్తున్నారు.

హారిక గతంలో సపోర్ట్ చేసినప్పటికీ..
ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. గతంలో బేబీ డే కేర్ టాస్క్ లో హారికతో ప్రవర్తించిన తీరుకు మాస్టర్ బ్యాడ్ అవ్వాల్సి వచ్చింది. చెడ్డిలో చేయి పెట్టి ఇష్టం ఉన్నట్లుగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మిగతా కంటెస్టెంట్స్ కాస్త ఫైర్ అయినప్పటికీ హారిక మాత్రం పార్ట్ ఆఫ్ ది గేమ్ అన్నట్లుగా సపోర్ట్ చేసింది. కానీ మాస్టర్ ఆమె విషయంలో మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.

మరోసారి టార్గెట్ అయిన అమ్మా
నోర్ముయ్ అంటూ 59వ రోజు హారికకు కౌంటర్ ఇవ్వడంతో ఆమె కూడా నామినేట్ చేసి రివెంజ్ తీర్చుకుంది. అబిజిత్ తో పాటు హారిక, అఖిల్ కూడా మాస్టర్ పై గుడ్డు కొట్టి నామినేట్ చేశారు. అయితే మళ్ళీ తనను టార్గెట్ చేస్తున్నట్లు అనిపించిందని అమ్మా మరోసారి ఆవేదన వ్యక్తం చేశాడు. గత వారం కూడా మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే.

ఇక ఆయన భవిష్యత్తు ఆడియెన్స్ చేతుల్లోనే..
ఇక ఈ వారం కూడా మళ్ళీ అమ్మా రాజశేఖర్ డేంజర్ జోన్ లోకివెళ్లేలా ఉన్నారని అనిపిస్తోంది. గతవారం అంటే నోయల్ వెళ్ళిపోయాడు కాబట్టి అమ్మా సేవ్ అయ్యారు. కానీ ఈ సారి ఆయన ఇంట్లో ఉండాలి అంటే కేవలం ఆడియెన్స్ ద్వారానే అది కుదురుతుంది. మరి అమ్మా రాజశేఖర్ విషయంలో ఆడియెన్స్ ఎలా ఆలోచిస్తారో చూడాలి. ఒక విధంగా ఆయన కోపం నెగిటి. అయ్యేలా కనిపిస్తోంది. మరి మిగతా రోజుల్లో ఏ విధంగా నడుచుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











