అఖిల్, మోనాల్ ప్రేమ ముచ్చట్లు.. గేట్ బయట ఒక అమ్మాయి వెయిట్ చేస్తోంది!
బిగ్ బాస్ షోలో ఎవరి గోల్ వారిదే అన్నట్లుగా మారుతోంది. డిఫరెంట్ టాస్క్ లతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెట్టె ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు. అయితే ఎవరు ఎలా గోడవ పడినా కూడా అఖిల్, మోనాల్ మాత్రం వారి ప్రేమ ముచ్చట్లతోనే షాక్ ఇస్తున్నారు. గురువారం ఎపిసోడ్ లో అయితే మరోసారి వారి మాటలతో అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా మోనాల్ అఖిల్ పై ఓ వైపు ప్రేమను చూపిస్తునే మరోవైపు జోకులు వేసింది.

కాబోయే భార్య ఎలా ఉండాలి అంటే..
అఖిల్ , మోనాల్ మధ్య రోజుకో రొమాంటిక్ సీన్ వైరల్ అవుతోంది. మాటలతోనే అందరికి షాక్ షాక్ ఇస్తున్నారు. కంటెస్టెంట్స్ అయితే వీరి మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక అఖిల్ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి అని విషయాన్ని మోనాల్ కి చాలా వివరంగా తెలియజేశాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మెట్టు పైకి ఎక్కి మోనాల్ కి బాగానే కౌంటర్ ఇచ్చాడు.

నీ కోసం ఎదురుచూస్తోంది
నన్ను బాగా చూసుకోకపోయినా పరవాలేదు. కానీ మా అమ్మా నాన్నలను మాత్రం బాగా చూసుకోవాలి. అప్పుడే తనను నేను కూడా బాగా చూసుకుంటాను. నా కంటే ఎక్కువగా నా పేరెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అఖిల్ తన డ్రీమ్ గర్ల్ గురించి చెప్పగా అందుకు మోనాల్ కూడా అలాంటి అమ్మాయే దొరుకుతుందచేంజ్ చెబుతూ గేట్ బయట నీ కోసం అఖిల్ రారా.. అంటూ వెయిట్ చేస్తుంటుందని చెప్పింది.

ఆ అమ్మాయి నువ్వేనా?
ఇక మోనాల్ ఇన్ డైరెక్ట్ గా తనను ఇష్టపడుతున్నట్లు చెబుతోందని అనుకున్న అఖిల్ అవును ఆ అమ్మాయి నాకు తెలుసా లేక నువ్వేనా అంటూ మధ్యలో ఒక ప్రశ్న వేశారు. అందుకు నవ్వుతూనే మ్యాటర్ ని పక్కదారి పట్టించింది మోనాల్. అలాగే నీ హార్ట్ లో ఒకరున్నారు కదా అంటూ ప్రశ్న వేయగా.. ఉంటే ఏంటి? బయటకు వెళ్ళాక హార్ట్ ని క్లీన్ చేసి మళ్ళీ రీ సెట్ చేసుకుంటానని అన్నాడు.
Recommended Video

మోనాల్ కు మద్దతు ఇచ్చిన అఖిల్
ఈ సంభాషణలో ఒక విధంగా ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటూనే ఒక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేశారు. అయితే అవుతుంది లేకుంటే లేదు అన్నట్లుగానే వారి చర్చను ముగించారు. ఇక హౌజ్ లో ఎవరు కూడా వారిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక చివరికి కెప్టెన్సీ విషయంలో అబ్బాయిలంతా అమ్మయిలకు సపోర్ట్ చేయాలని చెప్పడంతో అఖిల్ మోనాల్ కి మద్దతు ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











