రెచ్చగొట్టిన మోనాల్.. రొమాంటిక్ డోస్ పెంచిన అఖిల్.. అందాలతో తూట్లు పొడిచేశావ్ అంటూ
బిగ్ బాస్ షోలో రోజురోజుకు రొమాంటిక్ సన్నివేశాలు మరింత హైలెట్ అవుతున్నాయి. హగ్గులు కిస్ లు చాలా కామన్ అయిపోయాయనే చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా ముగ్గురి మధ్య ఒకే రకమైన లవ్ స్టొరీ నడవడం షోకి ఒక విధంగా మంచి హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. మోనాల్, అఖిల్, అబిజిత్ మధ్యన క్రియేట్ అవుతున్న సీన్స్ బాగానే హైలెట్ అయినప్పటికీ చివరికి ఆ ఎఫెక్ట్ మోనాల్ పైనే పడుతోంది.

ఒకరిని కాకపోతే మరొకరిని
అయితే మెయిన్ గా మోనాల్ ఒకరిని కాకపోతే మరొకరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇద్దరి అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి ఉండడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఒకవైపు అభిజిత్ మరోవైపు అఖిల్ తో ఆమె వ్యవహరించే తీరు షోలో ఒక ప్రేమదేశం వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దానివల్ల అభిజిత్, అఖిల్ మధ్య గొడవలు పెరిగి తెలియకుండానే శత్రువులయ్యారు.

మరోసారి రెచ్చగొట్టిన మోనాల్
బుధవారం రోజు ఎప్పటిలానే అఖిల్, మోనల్ కొంటే చూపులతో సైట్ కొట్టుకుంటూ దర్శనమిచ్చారు. మిర్రర్ ఇమేజ్ ప్లాన్ తో ఎదురెదురుగా కూర్చొని ప్రేమ కలలలో తెలారు. మోనాల్ రెచ్చగొట్టడంలో ఎంత తెలివిగా అడుగులు వేస్తుందో మరోసారి చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. తాను ఏం చేస్తే అఖిల్ కూడా అదే చేస్తున్నాడాని అంటూ పాటలు పాడింది. దానికి తోడు అఖిల్ కూడా ఆమె మాయలో పడిపోయి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలని అంటూ రాగాలు అందుకున్నాడు.

అందాలతో నన్ను తూట్లు పొడిచేశావ్
మొన్న కనిపించావు, మైమరిచి పోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేశావ్ అనే మరో పాటతో మోనాల్ సిగ్గు పడేలా చేశాడు అఖిల్. అందుకు మోనాల్ రొమాంటిక్ గా థాంక్యూ అని కూడా చెప్పేసింది. ఈ వారం మోనాల్, అఖిల్ మధ్య రొమాంటిక్ మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తోంది. మొన్న అఖిల్ తో కాస్త గోడవపడిన ఈ బ్యూటీ సడన్ గా యూ టర్న్ తీసుకోవడం వైరల్ అవుతోంది.
Recommended Video

పర్సనల్ లైఫ్ ని కూడా పట్టించుకోకుండా
టెలివిజన్ షోలో తన పర్సనల్ లైఫ్ ని కూడా పట్టించుకోకుండా మోనల్ నడుస్తున్న విధానం ఒక డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. అలాగే మరోవైపు ఆమె గ్లామర్ డోస్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. ఏ మాత్రం తగ్గకుండా యువకులను ఆకట్టుకునేలా ఆమె రోజుకో హాట్ లుక్ తో దర్శనమిస్తోంది. అందుకే ఈ బ్యూటీకి రెమ్యునరేషన్ స్ట్రాంగ్ గా అందుతున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











