బిగ్ బాస్ 4లో గ్రూపు రాజకీయాలు.. అభి, మోనాల్ మధ్య చిచ్చు పెడుతున్న ఆ నలుగురు
బిగ్ బాస్ సీజన్ 4 రసవత్తరమైన పొరుతో కొనసాగడం లేదు గాని ఎక్కువగా కట్టప్పలే దర్శనమిస్తున్నారు. గత సీజన్లలో అసలు రంగులు నిమిషాల్లో బయటపడేవి కానీ ఈ సారి మాత్రం నామినేషన్ ప్రక్రియ వచ్చే వరకు ఎవరు ఎలాంటి వారో అర్థం కావడం లేదు. టాస్క్ జరుగుతున్నప్పుడు ఎన్ని గొడవలు జరిగినా కూడా వాటిని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం.

బిగ్ బాస్ లో ఆ నలుగురు..
బిగ్ బాస్ లో రాజకీయాలు అనేవి చాలా కామన్ అని అందరికి తెలిసింది విషయమే. కానీ గ్రూపు రాజకీయాలు అనేవి చాలా రేర్. నమ్మకాలు అనేవి ఇక్కడ పని చేయవు. ఎక్కువగా పరిస్థితులను బట్టి రంగులు మారుస్తూ ఉండాలి. అయితే ఈ సారి హౌజ్ లో ఎక్కువగా లాస్య, హారిక, అభి, నోయల్ ఆ నలుగురు అనే ట్యాగ్ తో కొనసాగుతున్నారు.

గ్రూపు రాజకీయాలు
షో మొదలైన కొన్ని రోజులకే వీరి మధ్య దోస్తానా బలంగా మారింది. ఒకవేళ టాస్క్ లో భాగంగా టీమ్స్ గా విడిపోయినా కూడా వీరి మధ్య అసలు గొడవలు కూడా చాలా తక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చాలా తెలివిగా గ్రూపు రాజకోయలతో ఆడియెన్స్ కి షాక్ ఇస్తున్నారు. సోమవారం ఎపిసోడ్ లో కూడా ఎక్కువగా అదే హైలెట్ అయ్యింది.

నామినేషన్ ప్రక్రియలో తెలివిగా..
మిగతా కంటెస్టెంట్స్ ఎవరు ఏం మాట్లాడుకున్నా కూడా హారిక, లాస్య, అభిజిత్, నోయల్ మధ్యన చర్చలు జరగాల్సిందే. ఇక హారిక అయితే సమాచారాన్ని ఎక్కువగా సేకరిస్తోంది. నామినేషన్ ప్రక్రియలో కూడా వీళ్లు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. వారిలో వారిని నామినేట్ చేసుకోవడం లేదు. పైగా అభి మోనల్ మధ్య దూరం పెంచుతున్నారు.
Recommended Video

అభి, మోనాల్ మధ్య చిచ్చు
ఇక మోనాల్ మాత్రం అభిజిత్ కి తప్పితే ఆ గ్రూప్ లో ఎవరికి నచ్చడం లేదు. అందుకే వారిద్దరి మధ్య లాస్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. సోమవారం ఎపిసోడ్ లో నీ బెడ్ షీట్స్ మడతపెట్టలేదని అభి మనసులో మంటలు రగిలించారు. నోయల్ కూడా అందుకు వత్తాసు పలికాడు. ఇక అభి కూడా ఆమె ఛీటేడ్ అంటూ అసహ్యించుకున్నాడు.


Click it and Unblock the Notifications











