Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బిగ్ బాస్ 4: అయ్యయ్యో.. ఆమెతో పోల్చుకొని అభిమానులకు షాక్ ఇచ్చిన సమంత
బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో స్పెషల్ ఎపిసోడ్ గా 50వ రోజు అభిమానులకు మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి. అక్కినేని వారి కోడలు సమంత ఎంట్రీతో అభిమానులు చాలా వరకు ఎట్రాక్ట్ అయ్యారు. పండగా ఉన్నప్పటికీ సామ్ కోసం టీవీలకు అతుక్కుపోయారు. గతంలో ఎప్పుడు లేని విధంగా బుల్లితెరపై సమంత చేసిన హోస్టింగ్ బాగానే క్లిక్కయ్యింది. అయితే ఈ షోలో సమంత కంటెస్టెంట్స్ తో మాట్లాడిన విధానం చూస్తుంటే ఆమె షోను రెగ్యులర్ గా ఫాలో అవుతోందని అర్ధమవుతోంది.
నేను ఏం మాట్లాడినా.. తియ్యగానే వినబడాలి
ఎంట్రీతోనే ఎంత సక్కగున్నవే పాటతో సరికొత్తగా ఆకర్షించిన సమంత తెలుగు కూడా బాగానే మాట్లాడింది. అయితే ఆడియెన్స్ కి ముందుగానే తన తెలుగు గురించి ఒక క్లారిటీ ఇచ్చేసింది. కొంచెం మీరే నాకు సపోర్ట్ చేయాలి. నేను ఏం మాట్లాడినా కూడా మీకు ఈ రోజు తియ్యగానే వినబడాలి అంటూ సింపుల్ గా షోను స్టార్ట్ చేసింది. నాగ్ షూటింగ్ లొకేషన్ నుంచే సమంతను హౌజ్ మెంట్స్ కి పరిచయం చేశారు.
అరియానాతో పోల్చుకున్న సమంత
సమంత ముందుగా ఆడవాళ్ళతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరి గురించి చెప్పారు. అయితే ఊహించని విధంగా సమంత ఆడియెన్స్ కి ఒక పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సమంతను ఒక స్టార్ హీరోయిన్ గా అభిమానులు ఆమెను ఒక రేంజ్ లో చూస్తారు. కానీ ఆమె అరియానాతో మాట్లాడుతూ నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉందని చాలా ఈజీగా అనేసింది.
అభిమానులకు నచ్చలేదా?
ఒక విధంగా సమంత హెచ్చు తగ్గులు చూపకుండా కంటెస్టెంట్స్ తో కలిసిపోవడం బాగానే ఉంది. కానీ ఓ వర్గం వారు మాత్రం అరియానాతో పోల్చుకోవడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అరియానా అల్లరిపై షో మొదలైనప్పుటి నుంచి ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె అరుపులపై కూడా హౌజ్ మెంట్స్ చాలా సార్లు సెటైర్లు వేశారు. ఇక సమంత మాత్రం ఆమె అల్లరిని అలాగే బోల్డ్ నెస్ చూసి ఎట్రాక్ట్ అయ్యానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
అరియానా రేంజ్ పెరిగింది
ఇక సమంత అలా అనగానే అరియానా రేంజ్ హౌజ్ లో ఒక్కసారిగా పెరిగిపోయిందనే చెప్పాలి. సమంత మాటలకు అరియానా చాలా సంతోషించింది. ఎపిసోడ్ ఎండ్ అయ్యే వరకు ఆమె మొహంలో ఆ కిక్కు కినిపించింది. ఒక విధంగా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఏదేమైనా సమంత అందరితో చాలా క్లోజ్ అయ్యింది. ఒక్క ఎపిసోడ్ లోనే హోస్ట్ గా తన సత్తా ఏంటో చూపించింది. నిజంగా ఇది పెద్ద భారం అంటూనే బిగ్ బాస్ కి తగిన న్యాయం చేసింది.