నేను అలా చేస్తే నాగ చైతన్యకు కోపం.. మోనాల్ వలన పర్సనల్ విషయాన్ని బయటపెట్టిన సమంత
నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ వలన బిగ్ బాస్ హౌజ్ కి బ్రేక్ ఇవ్వడంతో ఆ బాధ్యతలను తనపై వేసుకున్న సమంత మొదటి అడుగులోనే ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. దసరా రోజు 50వ ఎపిసోడ్ ఎంతో స్పెషల్ గా కొనసాగింది. ఎక్కడా తగ్గకుండా సమంత తన తెలుగు మాటలతో చాలా బాగా ఎట్రాక్ట్ చేసింది. ఇక హౌజ్ మేంట్స్ తో సరదాగా మాట్లాడుతూనే ఇవ్వాల్సిన కౌంటర్స్ చాలా ఈజీగా ఇచ్చేసింది.

సలహాలు ఇచ్చిన సమంత
ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాన్ని చాలా ఓపెన్ గా చెప్పిన సమంత ఇవ్వాల్సిన సలహాలు కూడా చాలా క్లియర్ గా ఇచ్చేసింది. ప్రతి ఒక్కరి పర్సనల్ ఫీలింగ్స్ పై మాట్లాడుతూ మంచి చెడ్డలు కూడా మాట్లాడింది. ఇక మోనాల్ వ్యవహారం కూడా సమంతకు బాగా అర్థమైనట్లు ఆడియెన్స్ కి కూడా తెలిసిపోయింది.

మోనాల్ ని చూసి చాలా నేర్చుకోవాలి
ముందుగా మోనాల్ గురించి మాట్లాడిన సమంత.. మోనాల్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావ్. వచ్చిన ఏడు వారాల్లోనే చాలా నేర్చుకున్నావ్. మోనాల్ ని చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలి. ప్రేమ పంచుతుంది.. ప్రేమ తీసుకుంటుందని మాట్లాడిన సమంత అవతలి సైడ్ నుంచి మాటలు లెవేంటి అని నవ్వేసింది. ఇక మోనాల్ ఈ వీక్ చాలా బాధపడ్డావ్ కదా అని అడిగింది.

కన్నీళ్లు పెట్టుకున్న మోనాల్
సమంత ప్రశ్నకు మోనాల్ మాట్లాడుతూ.. ఏడ్చాను అది వదిలేసాను. నేను ఇక్కడికి గేమ్ కోసం వచ్చాను. ఇక్కడున్న వాళ్ళు నన్ను అంతగా అర్థం చేసుకోవడం లేదు. గతం గురించి నేను మర్చిపోయానని చాలా కూల్ గా సమాధానం ఇస్తూనే జరిగిందేదో జరిగిపోయిందని వివరణ ఇచ్చింది. అయితే మోనాల్ మాట్లాడుతూనే మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది.

నాగ చైతన్యకు ఇంకా కోపం వస్తుంది
మోనాల్ ఎడవడంతో సమంత కలుగజేసుకొని.. సమంత చాలా సైలెంట్ గా ఒక సెటైర్ వేసింది. ఏడిస్తే ఇంకా కోపం వస్తుందని తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ఒక సలహా ఇవ్వనా అంటూ ఏదైనా విషయంలో భర్త నాగచైతన్యతో చర్చ వచ్చినప్పుడు అర్థమయ్యేలా చెబితే వెంటనే ఎదుటివాళ్ళ మనల్ని అర్థం చేసుకుంటారు. కానీ ప్రతీ సారి ఏడిస్తే ఎదుటివాళ్లకు ఇంకా కోపం వస్తుంది. ఏడుపు అన్ని సార్లు వర్కౌట్ కాదని సమంత వివరణ ఇచ్చింది.

నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు
ఇక సమంత మాటలకు మళ్ళీ కన్నీళ్లు పెట్టుకున్న మోనాల్ నేను క్లారిటీతో చెప్పడానికి చాలా సార్లు ట్రై చేశాను. కానీ అది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఏడుస్తూ చెప్పగా సమంత మళ్ళీ నేను ఇప్పుడు నిన్ను ఏమన్నాను.. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అనేసింది. అలాగే మరోసారి నువ్వు ఎడవద్దు.. న్యూ బ్యూటీఫుల్ ఫేస్ కి నవ్వు చాలా బాగా సెట్టవుతుందని మోనాల్ తో చర్చను ముగించింది సమంత.


Click it and Unblock the Notifications











