ఈ సారి బిగ్ బాస్ 70రోజులే.. రాబోయే సెలబ్రెటీస్ ఎంతమంది అంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మరికొన్నిరోజుల్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ ఏండింగ్ లోనే షోను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి సరికొత్త మార్పులతో షోను నిర్వహించనున్నారు. కోవిడ్ 19 కారణంగా ఏ మాత్రం పొరపాటు జరగకుండా చాలా కఠినమైన నిర్ణయాలతో షోను కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇక షో పూర్తి వివరాలపై ఒక లుక్కేస్తే..

10వారాలు మాత్రమే..
బిగ్ బాస్ షోను ఈ సారి 10వారాలకు మాత్రమే కుదించినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అతి తక్కువ మంది టెక్నీషియన్స్ తోనే షో నిర్వహణ పనులను చూసుకొనున్నారట. ఇప్పటికే ప్లాన్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా దాదాపు రెడీ అయినట్లే అని టాక్ వస్తోంది.

13మంది మాత్రమే..
ఇక హౌక్ మెంట్స్ ఎంత మంది వస్తారు అనే విషయం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్ ని 15వారాల పాటు కొనసాగించిన స్టార్ మా ఇప్పుడు మాత్రం 10వారాలకే నిర్ణయించింది. ఇక హౌజ్ మెంట్స్ కేవలం 13మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఇప్పటికే కొంత పేర్లు లీక్ అయ్యాయి. సింగర్స్ తో పాటు యాంకర్స్ పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

నాగార్జున అంటున్నారు గాని
70రోజుల పాటు 13మంది కంటెస్టెంట్స్ అంటే షోలో ఎంటర్టైన్మెంట్ డోస్ ఏ మాత్రం ఉంటుంది అనేది మరో పెద్ద సందేహం. వీలైనంత వరకు డోస్ గట్టిగానే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక షోకి హోస్ట్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. నాగార్జున అంటున్నారు కానీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Recommended Video

షో స్టార్ట్ అయ్యే ముందు రోజు కూడా..
కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న తరుణంలో షో యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీలుకుంటుంది అనే ఆలోచన అందరిలో ఉంది. అయితే షో మొదలయ్యే రోజే తీసుకున్న జాగ్రత్తలపై ఒక వీడియో ద్వారా వివరణ ఇవ్వనున్నారట. షో స్టార్ట్ అయ్యే 14రోజుల ముందు అలాగే షోకి వెళ్లే ముందు రోజు కూడా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించిన తరువాత కంటెస్టెంట్స్ ని హౌజ్ లోకి పంపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











