బిగ్ బాస్ 4: బోటు దిగితే పోటు తప్పదు.. సెకండ్ వీక్ నామిమేషన్స్ షురూ.. గంగవ్వ డేరింగ్!

తెలుగు బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ మొదటి వారం పరవాలేదు అనిపించే విధంగా కొనసాగింది. కానీ జనాలకు ఉహాలకందని రేంజ్ లో అయితే పెద్దగా కిక్కు ఇవ్వలేదనే చెప్పాలి. కొందరి కంటెస్టెంట్స్ ఓవరాక్షన్ కూడా చాలా ఎక్కువైందనే కామెంట్స్ వచ్చాయి. ఎలిమినేషన్స్ కూడా ఆడియెన్స్ ముందే ఉహీంచారు. ఇక మొదటి వారం సూర్య కిరణ్ హౌజ్ నుంచి ఎలిమినెట్ అవ్వక తప్పలేదు.

పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు..

పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు..

బిగ్ బాస్ 4 మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో ఆడియెన్స్ పూర్తి స్థాయిలో అయితే సంతృప్తి చెందలేదు. తక్కువ ఖర్చులో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ని తీసుకువచ్చారనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక సూర్య కిరణ్ ఎలిమినెట్ అయిన తరువాత మరో సెలబ్రేటి సాయి కుమార్ దొంగలా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

సెకండ్ వీక్ మొదట రోజే ఎలిమినేషన్స్

సెకండ్ వీక్ మొదట రోజే ఎలిమినేషన్స్

ఇక సెకండ్ వీక్ మొదట రోజే ఎలిమినేషన్స్ ప్రక్రియ మొదలైనట్లు చాలా క్లియర్ గా అర్థమైంది. ఇటీవల ప్రోమో విడుదల చేయగా అందులో బిగ్ బాస్ నెవర్ బిఫోర్ అనే కాన్సెప్ట్ తో వచ్చాడు. బోటు దిగితే పోటు తప్పదు అనేలా సరికొత్త టాస్క్ ఈ ఎపిసోడ్ పై ఆసక్తిని కలిగిస్తోంది.

పడవ దిగిన వ్యక్తి..

పడవ దిగిన వ్యక్తి..

కంటెస్టెంట్స్ అందరూ వచ్చి ఒక బోటులో కూర్చోవాలి. పడవ తీరం చేరుకొని హారన్ కొట్టగానే ఒక ప్యాసింజర్ కచ్చితంగా దిగాల్సి ఉంటుంది. అలా పడవ నుంచి దిగిన ఇంటి సభ్యుడు నామినేషన్ అయినట్లు లెక్క. ఇక చర్చల అనంతరం హౌజ్ లో సభ్యులు ఎలిమినేషన్ ప్రక్రియ మరింత వేడెక్కుతోంది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 8 Highlights,సూర్య కిరణ్ ఎలిమినేటెడ్!
గంగవ్వ డేరింగ్

గంగవ్వ డేరింగ్

ఎప్పటిలానే తక్కువ మార్క్ లు వచ్చిన వారు డేంజర్ జోన్ లోకి వెళ్లక తప్పదు. చివరికి అందరి నిర్ణయాల తరువాత ఎవరో ఒకరు బోటు దిగక తప్పదు. అయితే ఈ పోటీలో గంగవ్వ చివరకు ఫస్ట్ నేనే దిగుతాను అంటూ డేరింగ్ గా చెప్పడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆమెను వద్దు అని ఆపుతున్నారు. చూస్తుంటే గంగవ్వ ఈ వారం కూడా సేఫ్ జోన్ లోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X