అబిజిత్ ఆఖరి వరకు ఉంటాడా.. సైలెంట్ గానే ఎట్రాక్ట్ చేస్తున్నాడు.. కానీ?

బిగ్ బాస్ నాలుగవ సీజన్ కంటెస్టెంట్స్ విషయంలో ఆడియెన్స్ చాలా వరకు కొంత నీరాశచెందారనే చెప్పాలి. ఈ సారి తప్పకుండా గత ఏడాది కంటే హై లెవెల్లో సెలబ్రెటీలను తెస్తారని అనుకున్నప్పటికి అంచనాలు తారుమరయ్యాయి. అక్కడే బిగ్ బాస్ షోకి భారీ దెబ్బ పడింది. ఇక షోలో కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న వారు వారి టాలెంట్ తో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అభిజిత్ ఒక విషయంలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు.

బిగ్ బాస్ లో కూడా అదే ఫాలో అవుతున్నాడు

బిగ్ బాస్ లో కూడా అదే ఫాలో అవుతున్నాడు

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా అంతగా హిట్ కాకపోయినా కూడా అభిజిత్ జనాలకు మాత్రం అప్పట్లో బాగానే కనెక్ట్ అయ్యాడు. అతని న్యాచురల్ లుక్, యాక్టింగ్ మంచి గుర్తింపు తెచ్చింది. ఇక బిగ్ బాస్ లో కూడా ఈ కుర్రాడు అదే ఫాలో అవుతున్నాడు. అందుకే ఓ వర్గం ఆడియెన్స్ నుంచి అతనికి మద్దతు భారీగా లభిస్తోంది.

కనీసం ధైర్యం చూపలేకపోతున్నాడు

కనీసం ధైర్యం చూపలేకపోతున్నాడు

అభిజిత్ మోనాల్ ని లైక్ చేసినప్పుడు కూడా జనాలు ఎక్కువగా అతనికే ఓట్లు వేశారు. ఫిజికల్ టాస్క్ లలో అభి పెద్దగా ఆకట్టుకున్నది లేదు. రీసెంట్ గా మంచి మనుషులు, కొంటే రాక్షసుల టాస్క్ లో అఖిల్ చాలా సైలెంట్ గానే ఉన్నాడు. ఫిజికల్ గా మెహబూబ్ ఎటాక్ చేసినా కూడా కనీసం ధైర్యం చేయలేదు. అప్పుడు కూడా మాటలతోనే ఎట్రాక్ట్ చేశాడు.

 కనీసం డ్యాన్స్ కూడా చేయలేదు

కనీసం డ్యాన్స్ కూడా చేయలేదు

ఇక శనివారం ఎపిసోడ్ లో అయితే ఏండింగ్ లో ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తుండగా అభి మాత్రం సైలెంట్ గా ఒక్కడే ఎదో అలా అలా ఆడుతూ కనిపించాడు. అన్ని రకాల టాలెంట్ లేకపోయినా కూడా అభిపై ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండడం వలన అతనికి అభిమానుల నుంచి మద్దతు బాగానే అందుతోంది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Jordar Sujatha Re Entry In Bigg Boss House
చివరి వరకు ఉంటాడట..?

చివరి వరకు ఉంటాడట..?

ఇటీవల ఒక టాక్ బాగా వైరల్ అయ్యింది. బిగ్ బాస్ ఏండింగ్ వరకు అభిజిత్ ఉంటాడని తెలుస్తోంది. అతను గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. ఇక మరోవైపు వైపు బిగ్ బాస్ టైటిల్ ఈసారైనా ఆడవాళ్లు గెలుచుకుంటారా అనే టాక్ వస్తోంది. అయితే ఎవరు ఉన్నా లేకపోయినా టాప్ 4లో అభి ఉంటాడని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవమే తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X