Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇది బిగ్ బాస్ షో కాదు, అక్కినేని ఫ్యామిలీ షో.. నెటిజన్ల ట్రోలింగ్
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడు భాషల్లో సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో ఈ రియాలిటి షోకి మంచి క్రేజ్ అందుతోంది. అయితే అప్పుడప్పుడు షోపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ట్రోలింగ్ అనేది కొత్తేమి కాకపోయినా నాగార్జున మాత్రం వాటిని అంత లైట్ తీసుకోడని ఇప్పటికే ఒకసారి ఋజువయ్యింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే బిగ్ బాస్ షో పూర్తిగా అక్కినేని ఫ్యామిలీ షో అయ్యిందనే కామెంట్స్ ఎక్కువవుతున్నాయి.
తారక్, నాని అలా ఫినిష్ చేశారు
మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా షోకు ఒక పవర్ఫుల్ ఇమేజ్ ని క్రియేట్ చేశాడనే చెప్పాలి. నందమూరి ఫ్యామిలి ఎంత పెద్దదైనా కూడా ఒక సినిమాకు తప్పితే మరోసారి వాడుకోలేదు. అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మించిన జైలవకుశ కూడా తన సినిమానే కాబట్టి తారక్ చాలా ఈజీగా వాడేసుకున్నాడు. ఇక నాని మాత్రం బిగ్ బాస్ ని అంతగా వాడుకోలేదనే చెప్పాలి.
ఫ్యామిలీ మొత్తాన్ని
అయితే నాగార్జున మాత్రం షోలోకి తన ఫ్యామిలీ మొత్తాన్ని దీంచేస్తున్నాడు అంటూ ట్రోలింగ్స్ వస్తున్నాయి. వైల్డ్ డాగ్ షూటింగ్ తో బిజీగా ఉండడం వలన బిగ్ బాస్ హోస్ట్ కి బ్రేక్ ఇచ్చిన నాగార్జున రంగంలోకి తన కోడలిని దింపిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తన చిన్న కుమారుడు అఖిల్ కూడా సమంతతో కలిసి బాగానే సందడి చేశాడు. దీంతో మరెవరూ దొరకలేదా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
అక్కినేని ఫ్యామిలీ షో..
ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీలు బాగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మీమర్స్ కి ఈజీగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. చాలా మంది ఇది బిగ్ బాస్ షో కాదని అక్కినేని ఫ్యామిలీ షో అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. పైగా సమంత మా టీవీ అనే డైలాగ్ పై కూడా ట్రోలింగ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్లు కూడా అక్కినేని షో అంటూ కామెంట్స్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video
గతంలో ట్రోల్ చేసినప్పుడు..
నాగార్జున ట్రోలింగ్ విషయంలో ఎంత సీరియస్ గా ఉంటాడో గంగవ్వ విషయంలో ఇదివరకే ఒకసారి ఋజువయ్యింది. వయసులో పెద్ద అయినప్పటికి అవ్వ అని పిలవడంతో ట్రోలింగ్ కి గురైన నాగ్ మరుసటి రోజే మళ్ళీ ఆమెనుచేల్లెమ్మా అంటూ సంభోదించాడు. వీలైనంత వరకు నెగిటివ్ కామెంట్స్ తనవరకు రాకుండా చూసుకునే నాగ్ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ షో అంటూ వస్తున్న ట్రోలింగ్స్ పై ఏ విధంగా స్పందిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.