బిగ్ బాస్4లో పులిహోర ప్రేమ చిచ్చు ..మోనాల్ కోసం అభిజిత్, అఖిల్

బుల్లితెరపై బిగ్ బాస్ షో సీజన్ 4 గ్రాండ్ గానే మొదలైంది. కానీ టాస్క్ లు మాత్రమే అంతగా క్లిక్కవ్వడం లేదనే చెప్పాలి. కరోనా కష్టకాలంలో హౌజ్ లోకి ఎవరిని పంపినా చూస్తారనుకున్నారో ఏమో గాని కంటెస్టెంట్స్ విషయంలో ఆడియెన్స్ చాలా వరకు నిరాశతోనే ఉన్నారు. ఇక రోజురోజుకి షోపై క్రేజ్ తగ్గుతోంది. రోజు మొత్తం జరిగిన విషయాలని గంట సేపు టెలిక్యాస్ట్ చేయడానికి ఎడిటర్లకు పెద్ద కష్టమైపోయిందనే అర్ధమవుతోంది.

ఆ లవ్ ట్రాక్ రోటీమ్ అయిపోయింది

ఆ లవ్ ట్రాక్ రోటీమ్ అయిపోయింది

సాధారణంగా షోలో ఎదో ఒక టాస్క్ ద్వారా కాంట్రవర్సీ ని క్రియేట్ చేయడం ముందు నుంచి వస్తున్న ఆచారమే. అయితే ఈ సారి ఎక్కువగా ట్రయాంగిల్ లవ్ స్టొరీపై పడటం ఓ వర్గం ఆడియెన్స్ ని బోర్ కొట్టించేస్తోంది. అభిజిత్, మోనాల్, అఖిల్ ముగ్గురు కూడా సింగిల్ లైన్ లోనే లవ్ ట్రాక్ నడిపించడం రొటీన్ అవుతోంది.

 పులిహోర ప్రేమలో తన్నుకునేలా ఉన్నారు

పులిహోర ప్రేమలో తన్నుకునేలా ఉన్నారు

ఇంకా ఈ పులిహోర ప్రేమను ఎన్ని రోజులు కలుపుతారో అనే సెటైర్స్ వస్తున్నాయి. ఇక అఖిల్, అభిజిత్.. మోనాల్ కోసం తన్నుకునేలా ఉన్నారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ వారంలో ఎక్కువగా వారి లవ్ ట్రాక్స్ తోనే షోకి ఎక్కువగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చాలా క్లియర్ గా అర్ధమవుతోంది.

 రియాలిటీ షో..డ్యాన్స్ షో అయ్యిందా?

రియాలిటీ షో..డ్యాన్స్ షో అయ్యిందా?

ఇక షోలో వేరేవాళ్ళు అసలు ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతోంది. ఇక కామెడీ స్కిట్స్, హాట్ డ్యాన్స్ లతో షో అర్దాన్ని మార్చేస్తున్నారు. మంగళవారం జబర్దస్త్ తరహాలో కామెడీ స్కిట్స్ చేసి.. బుధవారం డీ షో తరహాలో డ్యాన్స్ లను హైలెట్ చేశారు. దేత్తడి హారిక అయితే నెవర్ బిఫోర్ అనేలా హాట్ గా దర్శనమిస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 4 Episode 11 Highlights | Filmibeat telugu
ముంచుకొస్తున్న ఐపీఎల్ ప్రమాదం

ముంచుకొస్తున్న ఐపీఎల్ ప్రమాదం

షో గనక ఇలానే కొనసాగితే కనీసం ఒక సాధారణ సీరియల్ కి వచ్చిన రేటింగ్ కూడా రాదనే కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు ఐపీఎల్ కి ఎంతో సమయం లేదు. క్రికెట్ ప్రియులు ఆటను ఆస్వాధించి చాలా కాలవుతోంది కాబట్టి ఈ సారి ఐపీఎల్ తోనే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. సో బిగ్ బాస్ పై ఐపీఎల్ ఎఫెక్ట్ కచ్చితంగా పడుతుంది. మరి బిగ్ బాస్ రేటింగ్స్ కోసం టాస్క్ లలో డోస్ ఏమైనా డోస్ పెంచుతారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X