సోహైల్ సెంటిమెంట్ ఫలించింది.. మరోసారి తమ్ముడికే సపోర్ట్ చేసిన లాస్య.. విన్నర్ అతడే

బిగ్ బాస్ షోలో ఎవరు ఎలా ఉన్నా కూడా ఏదో ఒక రోజు మైనస్ అవ్వక తప్పదు. ఎమోషన్స్ ఉన్నా కూడా టాస్కులతో ఎప్పటికైనా హార్ట్ బ్రేక్ అవ్వాల్సిందే. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో హౌజ్ మేంట్స్ లలో కాస్త సీనియర్ సెలబ్రెటీ అయిన లాస్య చాలా వరకు గౌరవంగానే నడుచుకుంటోంది. వీలైనంత వరకు అందరికి దగ్గరగానే ఉండడానికి ఆమె ప్రయత్నం చేస్తోంది కానీ కొన్నిసార్లు అది వర్కౌట్ కావడం లేదు. మిగతావారిలో ఆమె పలుమార్లు శత్రువు కూడా అవుతోంది.

 విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు

విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు


అందరిలో ఒక రెస్పెక్ట్ తెచ్చుకున్న లాస్య టాస్కులలో కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు. లాస్య నవ్వుకు అభిమానులు చాలా మంది ఉన్నారు. అయితే ఆమెది కన్నింగ్ స్మైల్ అనే విమర్శ చాలా వైరల్ అయ్యింది. ఆఖరికి సమంత కూడా దాన్ని హైలెట్ చేసిన విషయం తెలిసిందే. ఎవరు ఏమనుకున్నా కూడా లాస్య తమ స్టైల్ లో బాగానే ముందుకు వెళుతోంది.

లాస్య చేతిలో విన్నర్

లాస్య చేతిలో విన్నర్

అసలు మ్యాటర్ లోకి వెళితే మంగళవారం, బుధవారం జరిగి బీబీ డే కేర్ టాస్క్ లో భాగంగా లాస్య ద్వారా బిగ్ బాస్ విన్నర్ ని ఎంపిక చేయమనడం చర్చనీయాంశంగా మారింది. ఆమె చేతికి ఇస్తే ఎవరిని నామినేట్ చేస్తారో ఓ వర్గం ఆడియెన్స్ ముందే ఊహించారని అనిపిస్తోంది. చాలా మంది కష్టపడినప్పటికి అమెచూపు ఒకరివైపే వెళ్లింది.

తమ్ముడిని విన్నర్ గా ప్రకటించిన లాస్య

తమ్ముడిని విన్నర్ గా ప్రకటించిన లాస్య

లాస్యని ఎవరు ఏమన్నా కూడా తమ్ముడి స్టైల్ లో సోహైల్ పర్ఫెమెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కూడా కొన్ని సందర్భాల్లో బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్స్ తో డైలీ సీరియల్ ని తలపిస్తున్నారు. ఇక ఆ సెంటిమెంట్ నిన్నటి టాస్క్ కి బాగానే పనికొచ్చింది. విన్నర్ ని ప్రకటించమని చెబితే లాస్య పెద్దగా ఆలోచించకుండా సోహైల్, అరియానా అనేసింది.

 ఓవరాక్షన్ కాంట్రవర్సీ..

ఓవరాక్షన్ కాంట్రవర్సీ..

బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా చిన్న పిల్లల మారిన అరియానా, కేర్ టేకర్ గా ఉన్న సోహైల్ బాగానే రచ్చ చేశారు. ఇక అఖిల్ మెహబూబ్ జోడి కూడా బాగానే హైలెట్ అయ్యింది. అయితే అమ్మా రాజశేఖర్, హారిక చిన్న పిల్లలుగా ఎగబడి పెర్ఫామెన్స్ ఇచ్చినా చివరికి అది ఓవరాక్షన్ కాంట్రవర్సీగానే ఎండ్ అయ్యింది.

బలాన్ని పెంచుకుంటున్న లాస్య

బలాన్ని పెంచుకుంటున్న లాస్య

ఏదేమైనా కూడా సోహైల్ పర్ఫెమెన్స్ గురించి గొప్పగా చెప్పిన లాస్య మరోసారి మనం మనం ఒకటి అన్నట్లుగానే డీల్ చేసుకున్నట్లు అర్ధమయ్యింది. ఇక సోహైల్ కూడా చాలా వరకు లాస్యకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ హౌజ్ లో జరిగే పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆమెతో చర్చలు సాగిస్తునే ఉంటాడు. ఇక హారిక, అబిజిత్, నోయల్ కూడా అప్పుడప్పుడు లాస్యకి మద్దతుగానే ఉంటున్నారు కాబట్టి ఇప్పట్లో ఆమె కనీసం. ఎలిమినేషన్స్ లో డేంజర్ జోన్ లోకి కూడా వచ్చే అవకాశం లేదని అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X