అఖిల్ కారణంగా మోనాల్‌పై పగ తీర్చుకున్న సోహైల్.. అంతా నీ వల్లే అంటూ..
సోమవారం ఎపిసోడ్ లో హౌజ్ లో చోటుచేసుకున్న పరిణామాలు ఈ వారం ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయో ఎవరికి అంతు చిక్కడం లేదు. మొన్నటివరకు ఫ్రెండ్లిగా ఉన్న వారు కూడా సోమవారం నామినేషన్స్ మొదలయ్యే సరికి శత్రువులుగా మారుతున్నారు. ముఖ్యంగా అఖిల్, సోహైల్ కి అస్సలు పడటం లేదు. ఇక అందుకు కారణం మోనాల్ అని సోహైల్ కుండ బద్దలు కొట్టేశాడు.

కామెడిపై కోపాలు
ఒకరిపై మరొకరు సీక్రెట్ గా సెటైర్లు వేయడం కామెంట్స్ చేయడం కామన్ అయినప్పటికీ అవి భవిష్యత్తులో సీరియస్ అవుతాయని అభి కారణంగా తెలిఐపోయింది. అతనికి అవినాష్ కామెడీ చేయడం నచ్చడం లేదు. ఇక సోహైల్ కూడా కొన్ని మాటలను సహించలేకపోతున్నాడు. మళ్ళీ తనలోని ఆగ్రహాన్ని చూపిస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు.

అఖిల్ హార్ట్ అయ్యాడు
సోహైల్, అరియానా మధ్య జరిగిన గొడవలో అఖిల్ మొదట కూల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ సోహైల్ దాన్ని ఆసరాగా తీసుకొని కాస్త ఓవర్ చేశాడు. దీంతో అఖిల్ హార్ట్ అయ్యాడు. అంతే కాకుండా అవినాష్ కూడా కూల్ చేసే ప్రయత్నం చేయగా అతన్ని కూడా సైడ్ కి తీసుకెళ్లాడు అఖిల్. దీంతో అఖిల్ తో తేడా వచ్చినట్లు సోహైల్ కి అర్ధమయ్యింది.

మోనాల్‌పై పగ తీర్చుకున్న సోహైల్
ఆ కోపాన్ని ఎలిమినేషన్స్ లో మోనాల్ పై చూపించాడు సోహైల్. ఇక్కడ విషయం అక్కడ అక్కడ విషయం ఇక్కడ చెప్తున్నావ్. అందమే అఖిల్‌కి నాకు మధ్య గొడవలు వస్తున్నాయని.. మోనాల్ ని నామినేట్ చేశాడు. అంతేకాకుండా టాస్క్‌లలో బాగా ఆడటం లేదని అందుకే నామినేట్ చేస్తున్నట్లు మోనాల్‌పై ఫైర్ అయ్యాడు సొహైల్. ఈ వివాదంతో అఖిల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

అరియానా.. ఇది మరీ టూ మచ్
ఇక మరో గుడ్డును కెప్టెన్ అరియానాపై కొట్టిన సోహైల్ ఆమె కెప్టెన్సీ మరీ టూ మచ్ గా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంతో మంది కెప్టెన్ గా ఉన్నారు. నేను కూడా చేశాను. కానీ నీ అంత ఓవర్ గా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె తలపై గుడ్డు కొట్టాడు. అందుకు సంబంధించిన సీన్ చూసి అవినాష్ కూడా షాక్ అయ్యాడు. ఇక మంగళవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ లో అసలు ట్విస్ట్ వెలువడనుంది.


Click it and Unblock the Notifications











