10కోట్లు పోగొట్టుకున్నా.. బిగ్‌బాస్ 4లో నాకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే: సూర్య కిరణ్

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 4 మంచి రేటింగ్ తోనే దూసుకుపోతోంది. షోకి సంబంధించిన ప్రోమోలతో హైప్ బాగానే క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విదంగా షోలో సరికొత్త ట్రయాంగిల్ లవ్ స్టోరీలు నడవడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక మొదటి వారం అందరూ ఊహించినట్టుగానే దర్శకుడు సూర్య కిరణ్ ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. అయితే సూర్య కిరణ్ బయటకు రాగానే రోజుకో ఇంటర్వ్యూలతో జనాలను మరింత ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా తన రెమ్యునరేషన్ గురించి కూడా పాజిటివ్ గానే చెప్పాడు.

మళ్ళీ సినిమాలు చేయకూడదని..

మళ్ళీ సినిమాలు చేయకూడదని..

సత్యం సినిమాతో 2003లో మంచి క్రేజ్ అందుకున్న సూర్య కిరణ్ ఆ తరువాత వరుస అపజయలతో కొంత నిరాశచెందినట్లు చెప్పాడు. అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎదురైన కొన్ని మోసాల వల్ల చాలా బాధపడినట్లు చెబుతూ మళ్ళీ సినిమాలు చేయకూడదని అనుకున్నట్లు వివరణ ఇచ్చాడు. మళ్ళీ కొన్నాళ్లకు తానేంటో నిరూపించుకోవాలని అనిపించిందని అందుకే మంచి కథలతో రెడీ అవుతున్నట్లు చెప్పాడు.

మోసపోయా...10కోట్ల వరకు పోగొట్టుకున్నా

మోసపోయా...10కోట్ల వరకు పోగొట్టుకున్నా

సూర్య కిరణ్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లే కొంతమంది మోసం చేశారు. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి దాదాపు 10కోట్ల వరకు నష్టపోయాను. ప్రస్తుతం నా దగ్గర 60కి పైగా కథలు సిద్దంగా ఉన్నాయి. నెక్స్ట్ సూత్రధారి అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను తప్పకుండా చెబుతాను.

బిగ్ బాస్ ద్వారా నాకు వచ్చిన రెమ్యునరేషన్

బిగ్ బాస్ ద్వారా నాకు వచ్చిన రెమ్యునరేషన్

నిజానికి బిగ్ బాస్ లోకి నేను వెళ్ళడానికి ప్రధాన కారణం ప్రైజ్ మని కోసమైతే కాదు. జనాలకు చాలా కాలంగా దూరంగా ఉన్నా. సో ఈ బిగ్ బాస్ ఫ్లాట్ ఫార్మ్ ద్వారా వారిని ఒకసారి దగ్గరవ్వాలనే ఆలోచనతోనే వచ్చాను. ఇక బిగ్ బాస్ ద్వారా నాకు మంచి రెమ్యునరేషన్ దక్కింది. అడిగిన దానికంటే పదింతలు ఎక్కువగా ఇచ్చారు.. అని సూర్య కిరణ్ వివరణ ఇచ్చారు.

వారానికి 10లక్షలకు పైగా..

వారానికి 10లక్షలకు పైగా..

సూర్య కిరణ్ కరెక్ట్ ఎమౌంట్ ఎంత అనే విషయాన్ని చెప్పకపోవడంతో యాంకర్ తెలివిగా సమాధానం రాబట్టే ప్రయత్నం చేశాడు. మీకు సాధారణంగా 2లక్షలు అనుకున్నా కూడా వారం రోజులకు 10లక్షలకు పైగా ఇచ్చి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేయగా.. ఆ విషయాన్ని బయటకు చెప్పకూడదని సూర్య కిరణ్ కూడా తెలివిగా తప్పించుకున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : జోకర్ గా Jabardasth Avinash వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!!
రెమ్యునరేషన్ విషయంలో వాళ్ళు నా కంటే ముదురు

రెమ్యునరేషన్ విషయంలో వాళ్ళు నా కంటే ముదురు

ఇక తన రెమ్యునరేషన్ ఎంత అనేది నేను చెప్పకూడదు అంటూ షోలో అంధరికంటే ఎక్కువ తనకే అనే విషయం తనకు తెలియదని అన్నారు. ఇక హౌజ్ లో ఉన్నవాళ్లు తనకంటే చాలా తెలివైన వాళ్ళని చెప్పిన సూర్య కిరణ్ రెమ్యునరేషన్ విషయంలో వాళ్ళు నా కంటే ముదురని కామెంట్ చేశాడు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో తాను అన్ని విషయాలపై చాలా కరెక్ట్ గా ఉన్ననని తెలిపిన ఈ దర్శకుడు కొందరికి అది నచ్చలేదని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X