అరియానా చూపులకు వణికిపోయిన సోహైల్.. మరీ ఇంత దారుణామా?
బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్స్ మధ్య చోటు చేసుకుంటున్న గొడవలు సోమవారం వచ్చే సరికి మరింత హీటెక్కుతున్నాయి. ఏలిమినేషన్స్ మొదలైతే చాలు సుతిమొత్తంగా నొప్పి తెలియకుండా గొంతు కోసేంత పని చేస్తున్నారు. అసలు స్వభావాలు బయటపడేది ఎక్కువగా సోమవారమే కాబట్టి ఆ రోజుతో మొదలైన కోపాలు వారం చివర వరకు అలానే కొనసాగుతున్నాయి. ఇక ఈ సారి పోటీ తీవ్రత మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తోంది.

నాగార్జున వార్నింగ్ ఇచ్చినప్పటి నుంచి..
బిగ్ బాస్ 4లో చాలా సేఫ్ గా గేమ్ ఆడుతున్న సభ్యుల్లో సోహైల్ ఒకరు. కోపంతో మొదలైన అతడు ఆ తరువాత ఎవరు ఎంత రెచ్చగొట్టిన కూడా కనీసం నోరు మెదపడం లేదు అంటే ఎంతగా కంట్రోల్ చేసుకుంటున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నాగార్జున వార్నింగ్ ఇచ్చినప్పటి నుంచి సోహైల్ లో తెలియని మార్పు వచ్చిందని ఈజీగా అర్ధమయ్యింది.

తెలివిగా నామినేట్ చేస్తున్నాడు
అయితే సోహైల్ కంటెస్టెంట్స్ ని క్లోజ్ చేసుకోవడంలో కూడా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నాడు. తనను టార్గెట్ చేస్తున్నారు అంటే చాలు వాళ్ళని ఎదో ఒక విధంగా పాజిటివ్ గా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సోమవారం ఎపిసోడ్ లో సోహైల్ అమ్మా రాజశేఖర్, అరియానాను నామినేట్ చేశాడు. అందుకు కారణాలను కూడా చాలా స్వీట్ గానే చెప్పాడు.

భయపడిన సోహైల్..
నామినేట్ చేస్తున్నప్పుడు సోహైల్ చాలానే భయపడ్డాడు. ముఖ్యంగా అరియానా విషయంలో అతను గజగజా వణికిపోయినట్లు అర్ధమయ్యింది. ఇక అది యాక్టింగ్ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అరియానా, మెహబూబ్ ని నామినేట్ చేయడంతో సోహైల్ మరో ఆలోచన లేకుండా ఆమెను నామినేట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.
Recommended Video

ఒక్కసారిగా సైలెంట్ అయిన అరియానా
సోహైల్ నామినేట్ చేస్తున్నప్పుడు అరియానా పెద్దగా మాట్లాడలేదు గాని చాలా సీరియస్ గా చూసింది. ఏమైనా ఉంటే చెప్పు అని అడిగినా కూడా ఆమె నోరు మెదపకుండా అలానే చూస్తూండిపోయింది. మిగతా వారు మెహబూబ్ ని నామినేట్ చేసినప్పటికీ తనను టార్గెట్ చేసి నామినేట్ చేయడం దారుణం అన్నట్లుగా అరియానా తన చూపులతోనే చెప్పేసింది. ఇక సోహైల్ కాస్త భయపడుతూనే అరియానాను నామినేట్ చేసిన సీన్ హౌజ్ లో ఒక్కసారిగా వాతావరణాన్ని చేంజ్ చేసింది.


Click it and Unblock the Notifications











