Don't Miss!
- News డబ్బు లేదా?: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన నిర్మలా సీతారామన్
- Sports SRH vs MI: చేతులెత్తేసిన హార్దిక్ పాండ్యా.. కెప్టెన్సీ చేసిన రోహిత్ వీడియో
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
Bigg Boss 4 Unseen ఎందుకే ఇంత అందంగా ఉన్నావ్.. అరియానాతో సోహెల్ పులిహోర
బిగ్ బాస్ షో చివరకు వచ్చింది. కానీ అరియానా సోహెల్ మధ్య ఉన్న టామ్ అండ్ జెర్రీ రిలేషన్ మాత్రం రూపాంతరం చెందినట్టు కనిపిస్తోంది. సోహెల్ ఎప్పుడూ కూడా అరియానాను స్నేహితురాలిగానే ట్రీట్ చేశాడు. అరియానా కూడా అదే దృష్టితో చూసింది. అయితే తాజాగా అన్ సీన్ ఎపిసోడ్లో అరియానాను సోహెల్ బాగానే ఫ్లర్ట్ చేశాడు. దీంతో దెబ్బకు అక్కడి నుంచి అరియానా వెళ్లిపోయింది.
ఎప్పుడూ ఏదో రకమైన గొడవే..
అరియానా సోహెల్అంటే చాలు అందరికీ టామ్ అండ్ జెర్రీ గుర్తుకు వస్తుంది. సీక్రెట్ రూంలో ఉన్న సమయం నుంచి అంతే. ఈ ఇద్దరికీ ఏదో విషయంలో గొడవలు జరుగుతూనే వస్తున్నాయి. ఆమె యాటిట్యూడ్ నచ్చదని సోహెల్.. అతని ప్రవర్తన నచ్చదని అరియానా ఫిర్యాదులు చేసుకుంటూనే ఉంటారు. మళ్లీ చివరకు ఒక్కటవుతారు.
ఒకరిపైకి మరొకరు..
ఇక పద్నాలుగో వారంలో ఈ ఇద్దరూ గొడవ పడిన తీరు.. ఒకరి మీదకు మరొకరు వెళ్లడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ తరువాత అరియానా కిందపడి గిలగిల కొట్టుకుని ఏడ్వడం ఉమెన్ కార్డ్ తీస్తూ.. ఒక అబ్బాయి అలా మీద మీదకు రావడం నచ్చలేదంటూసోహెల్ను బ్యాడ్ చేయాలని చూసింది. ఇదే విషయంపై నాగార్జున కూడా మందలించాడు. కానీ సోహెల్‌ను బ్యాడ్ చేయాలని అలా చేయలేదంటూ అరియానా చెప్పుకొచ్చింది.
క్లోజ్ అయ్యారు..
అలా గొడవ తరువాత సోహెల్ అరియానా బాగా క్లోజ్ అయ్యారు. తాజాగా అన్ సీన్ ఎపిసోడ్లో అయితే ఏకంగా అరియానాతో పులిహోర కలిపేశాడు సోహెల్. గార్డెన్ ఏరియాలో అఖిల్ సోహెల్ పడుకుని ఉన్నారు. అక్కడికి అరియానా తన కప్పులో ఏదో వేసుకుని తింటూ వచ్చింది. నాకు పెట్టకుండా తింటున్నావానే అంటూ సోహెల్ అరిచాడు.
చిన్నపాటి గొడవ..
అలా సోహెల్ తినిపించమని అడగడంతో స్పూన్‌తో అరియానా తినిపించింది. దాంతో పాటు మొహానికి కూడా కాసింత పూసినట్టుంది. దానికే సోహెల్ హర్ట్ అయ్యాడు.నేను చేస్తే హర్ట్ అవుతావ్.. నువ్ చేస్తేనేమో జోక్‌గా తీసుకోవాలా? అంటూ అరియానా అరిచింది. నేను కూడా జోక్‌గా అన్నానంటూ సోహెల్ బుజ్జగించేప్రయత్నం చేశాడు.
ఇంత అందంగా ఉన్నావ్..
ఇంత అందంగా ఎందుకు ఉన్నావ్.. అంటూ అరియానా బిస్కెట్లు వేయడం ప్రారంభించాడు సోహెల్. నీకు ఈ రోజు ఏమైందంటూ సోహెల్‌కు అరియానా సెటైర్ వేసింది. ఈ వయసులోనూ ఇంత అందంగా ఎలా ఉన్నావ్ అని సోహెల్ అంటే.. ఈ వయసు ఏంటిరా? అని తిరిగి అరియానా ప్రశ్నించింది.
|
వయసుపై చర్చ..
నీకు 32 ఉంటాయ్ కదా అని సోహెల్ అంటే.. నీకు 32 రా అని అరియానా సెటైర్ వేసింది. నాకు 28 అని సోహెల్ అంటే .. నాకు 24 అని అరియానా చెప్పుకొచ్చింది. అయినా 24లోనూ పదహారేళ్ల అమ్మాయిలా ఇంత అందంగా ఎలా ఉన్నావే అంటూ సోప్ వేశాడు. సోహెల్ పులిహోరను తట్టుకోలేని అరియానా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది.