Bigg Boss Telugu Elimination: 10వ వారం ఎవరు ఇంటి నుంచి అవుట్ అంటే!

తెలుగు బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 కరోనా సమయంలో కూడా బాగానే హడావుడి చేసింది. తెలుగులో మొదలైన తరువాతనే ఇతర భాషల్లో కూడా స్టార్ట్ చేశారు. నాగార్జున చాలా తెలివిగా షో కోసం వివిధ రకాల ప్రణాళికలతో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత, సుమ ఎంట్రీలతో రేటింగ్ భాగానే అందుకున్నారు. అయితే చివరికి ఎలిమినేషన్స్ లో మాత్రం బిగ్ బాస్ పై జనాలు కాస్త అసంతృప్తితోనే ఉన్నట్లు అర్ధమయ్యింది. ఫిల్మీ బీట్ ఇటీవల పోల్ నిర్వహించగా అందులో చాలా మంది వారి అభిప్రాయంపై స్పందించారు.

ఎలిమినేషన్ ప్రక్రియలో అన్యాయం?

ఎలిమినేషన్ ప్రక్రియలో అన్యాయం?

షో మొదలైన రోజు నుంచి కూడా హౌజ్ లో ఆశ్చర్యపరిచే ఘటనలు పెద్దగా కనిపించలేదు. ఈ సారి ఎక్కువగా ట్రయాంగిల్ లవ్ స్టొరీ లేదంటే అక్కడక్కడా కొన్ని టాస్క్ లతో బిగ్ బాస్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. ఇక రేటింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ టీమ్ ఏదో డ్రామా క్రియేట్ చేస్తోందనే రూమర్స్ వస్తున్నాయి. ఇక అన్యాయం జరిగిందని కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తరువాత అసలు విషయాలను బయటపెడుతున్నారు.

అమ్మా రాజశేఖర్ ను కూడా అలానే పంపించేశారా?

అమ్మా రాజశేఖర్ ను కూడా అలానే పంపించేశారా?

అమ్మా రాజశేఖర్ బిగ్ బాస్ హౌజ్ లో హడావుడి గట్టిగానే చేసినప్పటికి ఎందుకో వర్కౌట్ కాలేదు. గేమ్ లో కెమెరాలన్ని ఎక్కువగా ఫోకస్ అయ్యేలా గొడవలు కూడా పెట్టుకున్నాడు. అయితే గతంలో మాదిరిగా మరోసారి అన్యాయం జరిగిందనే విషయంలో ప్రశ్నించగా 79% జనాలు అవునని అంగీకారాన్ని తెలిపారు. అమ్మా రాజశేఖర్ ఇంకా ఉండాల్సిందని కేవలం 18% జనాలు మాత్రమే కోరుకున్నారు.

డేంజర్ జోన్ లో అరియానా.. టార్గెట్ చేస్తున్నారా?

డేంజర్ జోన్ లో అరియానా.. టార్గెట్ చేస్తున్నారా?

బిగ్ బాస్ 8వ వారంలోనే నామినేట్ అయిన వారిలో ఫోకస్ ఎక్కువగా అమ్మా రాజశేఖర్ పైనే ఉన్నట్లు తెలిసిపోయింది. ఇక ఈ సారి అదే తరహాలో ఇంటి సభ్యులు అరియానాను ఫోకస్ చేసినట్లుగా అర్ధమవుతోంది. ఈ వారంలో అవినాష్ తప్పితే మిగతా వారు మొత్తం అరియానాను ఎలిమినేషన్ లో ఉంచడం హాట్ టాపిక్ గా మారింది. 56% జనాలు అది అవును అని ఒప్పుకోగా కాదు అని 41% మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సుమ ఎంట్రీ ఎలా ఉంది?

సుమ ఎంట్రీ ఎలా ఉంది?

పండగ సమయంలో నాగార్జున స్థానంలో హోస్ట్ గా దర్శనమిచ్చిన సమంత ఎంతవరకు న్యాయం చేసిందనే విషయంలో జనాలు ఆమెకు కొంతవరకు సపోర్ట్ చేశారు. ఇక గత వారం హడావుడి చేసిన యాంకర్ సుమ కూడా ఉన్నంత సేపు తన మాటలతో బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఆమె ఎంట్రీ బాగుంది అని 61% ఓట్స్ వచ్చాయి. అయితే పూర్తి స్థాయిలో ఆమె సరైన న్యాయం చేయలేదనే వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో గెస్ట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ వారం ఏలిమినేట్ అయ్యేది ఎవరు?

ఈ వారం ఏలిమినేట్ అయ్యేది ఎవరు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 పదవ వారానికి చేరుకుంది. దీంతో ఈ వారం హౌజ్ నుంచి వెళ్లే కంటెస్టెంట్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎదో ఒక విధంగా క్రేజ్ అందుకున్నవారే. బలంగా పోరాడుతున్నారు కూడా. ఇక జనాల ఫోకస్ మాత్రం మెహబూబ్ పైనే ఉంది. 40% జనాలు అతను వెళ్లిపోతాడాని అనుకుంటున్నారు. ఇక ఆ తరువాత అరియానా, మోనాల్ కూడా వెళ్లిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక అభిజిత్, హారిక, సోహైల్ సేఫ్ అయ్యేలా ఉన్నారని అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X