Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Telugu Elimination: 11వ వారం వెళ్లిపోయేది ఎవరు.. సర్వేలో షాక్ ఇచ్చిన ఆడియెన్స్
తెలుగు బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇన్ని రోజులు రేటింగ్స్ ని పట్టించుకోకుండా బాగానే హడావుడి చేసింది. ఇక షో దాదాపు ఏండింగ్ లోకి వచ్చేసింది. హోస్ట్ నాగార్జున చాలా తెలివిగా షో కోసం వివిధ రకాల ప్రణాళికలతో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సమంత, సుమ ఎంట్రీలతో రేటింగ్ భాగానే అందుకున్నారు. అయితే ఎంత చేసినా కూడా ఎలిమినేషన్స్ లో మాత్రం బిగ్ బాస్ పై జనాలు కాస్త అసంతృప్తితోనే ఉన్నట్లు గతంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఫిల్మీ బీట్ ఇటీవల స్సర్వే నిర్వహించగా అందులో చాలా మంది వారి అభిప్రాయాని ఓటు వేసి మరి తెలియజేశారు.
ఈ సారి న్యాయమే జరిగింది
షో మొదలైన కొత్తలో హౌజ్ లో ఆశ్చర్యపరిచే ఘటనలు పెద్దగా కనిపించలేదు. ఎక్కువగా ట్రయాంగిల్ లవ్ స్టొరీ లేదంటే అక్కడక్కడా కొన్ని టాస్క్ లతో బిగ్ బాస్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. ఇక రేటింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ టీమ్ ఏదో డ్రామా క్రియేట్ చేస్తోందని గతంలో చాలా రకాల రూమర్స్ వచ్చాయి. అన్యాయం జరిగిందని కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తరువాత అసలు విషయాలను బయటపెడుతున్నారు. కానీ గత వారం న్యాయమే జరిగినట్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మెహబూబ్ ను ఎలిమినెట్ చేయడం సరైనదేనా?
మెహబూబ్ దిల్ సే.. ఫిజికల్ టాస్కులలో హడావుడి గట్టిగానే చేసినప్పటికి ఎందుకో వర్కౌట్ కాలేదు. గేమ్ లో కెమెరాలన్ని ఎక్కువగా ఫోకస్ అయ్యేలా ఇతరులపై తన బలాన్ని కూడా చూపించాడు. అయితే మెహబూబ్ ఎలిమినెట్ కావడంతో గతంలో మాదిరిగా మరోసారి న్యాయం జరిగిందా లేదా అని ప్రశ్నించగా 71% జనాలు న్యాయం జరిగిందని, అవునని ఓటు వేశారు. కరెక్ట్ కాదు అని కేవలం 22% జనాలు మాత్రమే కోరుకున్నారు.
నామినేషన్ లో గొడవ.. తప్పు ఎవరిది
బిగ్ బాస్ 11వ వారం నామినేట్ అయిన వారిలో ఫోకస్ ఎక్కువగా అభిజిత్ పైనే ఉన్నట్లు తెలిసిపోయింది. ఈ వారంలో హారిక లాస్య తప్పితే మిగతా వారు మొత్తం అభిని ఎలిమినేషన్ లో ఉంచడం హాట్ టాపిక్ గా మారింది. ఇక సోహెల్, అఖిల్, అభి, హారిక, నామినేషన్ ప్రక్రియలో గొడవ గట్టిగానే చేశారు. అయితే అందులో ఎవరిది తప్పు అనే ప్రశ్నకు.. ఎక్కువగా అఖిల్ అని 55% జనాలు ఓటు వేశారు. హారిక పెద్దగా తప్పు లేదని 10% ఓట్లతో అర్ధమయ్యింది. ఇక అభిజిత్ ది కూడా తప్పు ఉందని 17% జనాలు ఓటు వేశారు.
బిగ్ పరిస్థితి ఎలా ఉందంటే..
పండగ సమయంలో నాగార్జున స్థానంలో హోస్ట్ గా దర్శనమిచ్చిన సమంత ఒక్కసారిగా షో రేటింగ్ పెంచేసిందనే చెప్పాలి. ఇక ఆ మధ్య యాంకర్ సుమ ఎంట్రీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ వారం కమాండో ఇన్స్టిట్యూట్ టాస్క్ లోనే ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేశారు. షో బాగుంది అని 48% ఓట్స్ వచ్చాయి. అయితే పూర్తి స్థాయిలో మెప్పించడం లేదనే వారు కూడా చాలా మందే ఉన్నారు. 38% బాగాలేదని అంటున్నారు.
Recommended Video
ఈ వారం ఏలిమినెట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 పదకొండవ వారానికి చేరుకుంది. దీంతో ఈ వారం హౌజ్ నుంచి వెళ్లే కంటెస్టెంట్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎదో ఒక విధంగా క్రేజ్ అందుకున్నవారే. బలంగా పోరాడుతున్నారు కూడా. ఇక జనాల ఫోకస్ మాత్రం మోనాల్ పైనే ఉంది. 46% జనాలు ఆమె వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు. ఇక ఆ తరువాత లాస్య(14%), సోహెల్ (12%), అరియానా(12) కూడా వెళ్లిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక అభిజిత్ వెళ్లిపోవాలని 5% జనాలు మాత్రమే కోరుకుంటున్నారు.