Bigg Boss Telugu Elimination: 12వ వారం వెళ్లిపోయేది ఎవరు.. సర్వేలో బయటపడ్డ టైటిల్ విన్నర్!

ఇండియన్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇన్ని రోజులు రేటింగ్స్ ని పట్టించుకోకుండా బాగానే హడావుడి చేసింది. ఇక షో దాదాపు తుది దశకు చేరుకుంది. హోస్ట్ నాగార్జున చాలా తెలివిగా షో కోసం వివిధ రకాల ప్రణాళికలతో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత, సుమ ఎంట్రీలతో ఆ మధ్య రేటింగ్ భాగానే పెరిగింది. అయితే ఎంత చేసినా కూడా ఎలిమినేషన్స్ లో మాత్రం బిగ్ బాస్ పై జనాలు కాస్త అసంతృప్తితోనే ఉన్నట్లు గతంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఫిల్మీ బీట్ ఇటీవల స్సర్వే నిర్వహించగా అందులో చాలా మంది టైటిల్ విన్నర్ పై అభిప్రాయాని ఓటు వేసి మరి తెలియజేశారు.

రూట్ మార్చిన బిగ్ బాస్

రూట్ మార్చిన బిగ్ బాస్

బిగ్ బాస్ షో మొదలైన కొత్తలో హౌజ్ లో ఆశ్చర్యపరిచే ఘటనలు పెద్దగా కనిపించలేదు. ఎక్కువగా ట్రయాంగిల్ లవ్ స్టొరీ లేదంటే అక్కడక్కడా కొన్ని టాస్క్ లతో బిగ్ బాస్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. ఇక రేటింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ టీమ్ ఏదో డ్రామా క్రియేట్ చేస్తోందని గతంలో నెగిటివ్ రూమర్స్ అయితే వచ్చాయి. అన్యాయం జరిగిందని కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తరువాత అసలు విషయాలను బయటపెడుతున్నారు. కానీ 10, 11వ వారం న్యాయమే జరిగినట్లు జనాల అభిప్రాయం ద్వారా అర్ధమవుతోంది.

లాస్య ఎలిమినేషన్ సరైనదేనా?

లాస్య ఎలిమినేషన్ సరైనదేనా?

మెహబూబ్ దిల్ సే వెళ్లిపోయిన తరువాత హౌజ్ లో ఉన్న అందరూ మేజర్ కంటెస్టెంట్స్ అనే చెప్పాలి. అయితే ఊహించని విధంగా లాస్య వెళ్లిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని టాస్కులలో హడావుడి గట్టిగానే చేసినప్పటికి ఎందుకో వర్కౌట్ కాలేదు. గేమ్ లో కెమెరాలన్ని ఎక్కువగా ఫోకస్ అయ్యేలా ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడేది లాస్య. ఇక ఆమె ఎలిమినెట్ కావడంతో గతంలో మాదిరిగా మరోసారి న్యాయం జరిగిందా లేదా అని ప్రశ్నించగా 65% జనాలు న్యాయం జరిగిందని, అవునని ఓటు వేశారు. కరెక్ట్ కాదు అని కేవలం 31% జనాలు మాత్రమే కోరుకున్నారు.

నామినేషన్ లో గొడవ.. తప్పు ఎవరిది

నామినేషన్ లో గొడవ.. తప్పు ఎవరిది

బిగ్ బాస్ 12వ వారం నామినేషన్ చా డిఫరెంట్ గా జరిగింది. బిగ్ బాస్ టాస్కులతో లింక్ పెడుతూ నామినేషన్ ప్రక్రియను కొనసాగించారు. అయితే సోమవారం ఎపిసోడ్ లో స్వాపింగ్ హైలెట్ గా నిలిచింది. అందులో హారిక తన పవర్ ద్వారా అభిజిత్ ప్లేస్ లో హరికను స్వాప్ చేసి ఎలిమినేషన్ లో ఉంచింది. ఇక ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నపై.. 64% జనాలు కరెక్ట్ అని ఓటు వేశారు. మోనాల్ కి మద్దతుగా కరెక్ట్ కాదు అంటూ 33% జనాలు క్లారిటీ ఇచ్చారు.

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై సర్వే..

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై సర్వే..

బిగ్ బాస్ నాలుగవ సీజన్ టైటిల్ విన్నర్ పై మొదటి నుంచి వస్తున్న టాక్ నిజమయ్యేలా ఉంది. ఎంతమంది పోటీ ఇచ్చినా కూడా అభిజిత్ గెలవడం కాయమని సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్ ఒక రేంజ్ లో ప్రచారాలు చేస్తున్నారు. ఇక ఫిల్మీ బీట్ సర్వేలో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ పై పోల్స్ నిర్వహించగా అభిజిత్ గెలుస్తాడాని 58% జనాలు కోరుకుంటున్నారు. ఇక ఆ తరువాత కంటెస్టెంట్స్ గెలవడం కష్టమని 10% కంటే తక్కువమంది వారి అభిప్రాయం చెప్పారు. సోహైల్ గెలిచే అవకాశం ఉందని 11% జనాలు క్లారిటీ ఇచ్చారు. అవినాష్ - అరియానా గ్లోరి 8%, హారిక 5%, మోనాల్-అఖిల్ 4%.. వరకు ఓట్లు అందుకున్నారు. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
12వ వారం ఏలిమినెట్ అయ్యేది ఎవరు?

12వ వారం ఏలిమినెట్ అయ్యేది ఎవరు?

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ 12వ వారానికి చేరుకుంది. ఇక ఈ వారం హౌజ్ నుంచి వెళ్లే కంటెస్టెంట్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎదో ఒక విధంగా క్రేజ్ అందుకున్నవారే. అభిజిత్, సోహెల్ సేవ్ అయిన తరువాత లిస్టులో ఉన్న మోనాల్ పైనే ఫోకస్ ఎక్కువగా ఉంది. 27% జనాలు ఆమె వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు. ఇక ఆ తరువాత అవినాష్(26%), అఖిల్(24%), అరియానా(22%)లలో ఎవరైనా వెళ్లిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X