Bigg Boss Telugu Elimination: 13వ వారం వెళ్లిపోయేది అతనేనా.. ఫైనల్ విన్న‌ర్‌పై మరో షాకింగ్ రిపోర్ట్

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పై రోజురోజుకు ఆసక్తి మరింత ఎక్కువవుతోంది. ఇన్ని రోజులు రేటింగ్స్ తగ్గుతూ పెరుగుతూ వచ్చాయి. వాటిని పట్టించుకోకుండా కంటెస్టెంట్స్ బాగానే హడావుడి చేశారు. ఇక షో దాదాపు తుది దశకు చేరుకుంది. హోస్ట్ నాగార్జున వివిధ ప్రణాళికలతో షో స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.. సెలబ్రెటీల ఎంట్రీతో ఈ మధ్య రేటింగ్ భాగానే పెరిగింది. ఇక ఎలిమినేషన్స్ లో మాత్రం రెగ్యులర్ గా విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో అయితే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక ఫిల్మీ బీట్ ఇటీవల ఒక సర్వే నిర్వహించగా అందులో చాలా మంది వారి అభిప్రాయాని ఓటు ద్వారా తెలియజేశారు. ఆ రిపోర్ట్ పై ఒక లుక్కేస్తే..

 ఏదో డ్రామా జరుగుతోంది

ఏదో డ్రామా జరుగుతోంది

మొదలైన కొత్తలో హౌజ్ లో ఆశ్చర్యపరిచే ఘటనలు పెద్దగా కనిపించలేదు. ఎక్కువగా ట్రయాంగిల్ లవ్ స్టొరీ లేదంటే అక్కడక్కడా కొన్ని టాస్క్ లతో బిగ్ బాస్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. ఇక రేటింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ టీమ్ ఏదో డ్రామా క్రియేట్ చేస్తోందని గతంలో నెగిటివ్ రూమర్స్ అయితే వచ్చాయి. అన్యాయం జరిగిందని కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తరువాత అసలు విషయాలను బయటపెడుతున్నారు. కానీ ఇటీవల న్యాయమే జరిగినట్లు జనాల అభిప్రాయం ద్వారా అర్ధమవుతోంది.

 అతను మాత్రం బయటకు వెళ్లలేదు

అతను మాత్రం బయటకు వెళ్లలేదు

బిగ్ బాస్ లో ప్రతి వారం ఎలిమినేషన్ లో టార్గెట్ అవుతూ వస్తున్న అభిజిత్ ఇంతవరకు కెప్టెన్సీ పోస్ట్ అందుకోలేదు. అయినప్పటికీ ఏ రోజు కూడా ఎలిమినేషన్ లో అభి పెద్దగా ఇబ్బంది పడింది లేదు. కెప్టెన్లు కూడా వెళ్లిపోయారు కానీ అతను మాత్రం బయటకు వెళ్లలేదు. అయితే గత వారం నుంచి గమనించిన నాగార్జున అతన్ని స్పెషల్ గా టార్గెట్ చేశారా అనే అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి.

 వారిద్దరిని నాగ్ టార్గెట్ చేశారా?

వారిద్దరిని నాగ్ టార్గెట్ చేశారా?

టాస్కులలో నిర్లక్ష్యం వహించగా నాగార్జున అభికి చీవాట్లు పెట్టేశారు. ఇక అతని ఎలిమినేషన్ నుంచి తప్పించి ప్రతి క్షణం సపోర్ట్ చేసిన హరికను కూడా నాగార్జున గట్టిగానే కడిగి పారేశారు. 12వారాంతంలో ఆ ఇద్దరిని నాగార్జున టార్గెట్ చేశారని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు.. అవును అంటూ 75% ఏకీభవించారు. కాదు అంటూ కేవలం 23% జనాలు మాత్రమే నాగార్జునకు సపోర్ట్ చేశారు.

మోనాల్ మాట్లాడింది నిజమేనా?

మోనాల్ మాట్లాడింది నిజమేనా?

ఇక మోనాల్ గజ్జర్ ఎలిమినేషన్ లో అఖిల్ తో జరిపిన చర్చ ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేసింది. బ్రెయిన్ పెట్టి గేమ్ ఆడు అంటూ అభి మట్లాడగా.. నేను హార్ట్ తో ఆడుతున్నాను అంటూ కౌంటర్లు గట్టిగానే ఇచ్చింది మోనాల్. అయితే ఈ విషయంలో మోనాల్ కు వ్యతిరేకంగా 64% జనాలు కాదు అనడం వైరల్ గా మారుతోంది. అవును నిజమే మాట్లాడింది అంటూ 28% జనాలు మాత్రమే మద్దతు ఇచ్చారు.

13వ వారం ఏలిమినేట్ అయ్యేది ఎవరు?

13వ వారం ఏలిమినేట్ అయ్యేది ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి తుది దశకు చేరుకుంది. దీంతో ఈ వారం హౌజ్ నుంచి వెళ్లే కంటెస్టెంట్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎదో ఒక విధంగా క్రేజ్ అందుకున్నవారే. బలంగా పోరాడుతున్నారు కూడా. ఇక జనాల ఫోకస్ మాత్రం మోనాల్, అవినాష్ ల పైనే ఉంది. 38% జనాలు మోనాల్ వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు. ఇక ఆ తరువాత అవినాష్ వెళ్లిపోవాలని(39%), హారిక (8%), అఖిల్(8%), ఇక అభిజిత్ వెళ్లిపోవాలని 5% జనాలు మాత్రమే కోరుకుంటున్నారు.

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
బిగ్ బాస్ విన్నర్.. మరో షాకింగ్ రిపోర్ట్

బిగ్ బాస్ విన్నర్.. మరో షాకింగ్ రిపోర్ట్

బిగ్ బాస్ 4వ సీజన్ టైటిల్ విన్నర్ పై మొదటి నుంచి వస్తున్న టాక్ నిజమయ్యేలా ఉంది. ఎంతమంది పోటీ ఇచ్చినా కూడా అభిజిత్ గెలవడం పక్కా అంటున్నారు. సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్ ఒక రేంజ్ లో ప్రచారాలు చేస్తున్నారు. ఇక ఫిల్మీ బీట్ సర్వేలో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ పై పోల్స్ నిర్వహించగా అభిజిత్ గెలుస్తాడాని ఎప్పటిలానే 58% జనాలు కోరుకుంటున్నారు.

ఇక ఆ తరువాత కంటెస్టెంట్స్ గెలవడం కష్టమని ఒక్కొక్కరికి 10% కంటే తక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు. సోహైల్ గెలిచే అవకాశం ఉందని 8% జనాలు క్లారిటీ ఇచ్చారు. అవినాష్ (8%) - అరియానా గ్లోరి (9%), హారిక(3%), మోనాల్(4%)-అఖిల్ (6%).. వరకు ఓట్లు అందుకున్నారు. మరి ఈ అంచనాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X