Bigg Boss Telugu Elimination: అవినాష్ విషయంలో షాకింగ్ రిపోర్ట్.. 14వ వారం వెళ్లిపోయేది ఎవరంటే?

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మొత్తానికి చివరి దశకు చేరుకుంటోంది. మరో రెండు వారాలు గడిస్తే అసలు విన్నర్ ఎవరనే దానిపై ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. ఇక గత వారం అవినాష్ ఎలిమినెట్ అవ్వడంపై కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. మోనాల్ సేవ్ అవ్వడం కూడా ఆశ్చర్యం. ఇక ఫిల్మీ బీట్ ఇటీవల ఒక సర్వే నిర్వహించగా అందులో చాలా మంది వారి అభిప్రాయాని ఓటు ద్వారా తెలియజేశారు. ఆ రిపోర్ట్ పై ఒక లుక్కేస్తే..

ఈ వారం హవా మొత్తం వారిదే..

ఈ వారం హవా మొత్తం వారిదే..

షో మొదలైన కొత్తలో హౌజ్ లో కొందరు కంటెస్టెంట్స్ చాలా ఫ్రెండ్లిగా ఉండేవారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఎమోషన్స్ కూడా మాయమవుతున్నాయి. గెలవాలనే పట్టుదలతో ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఇక ఈ మధ్యలో గొడవలు కామన్ గా మారుతున్నాయి. ఈ వారం మొత్తం ఎక్కువగా సోహెల్, అరియానా హవా ఎక్కువగా నడిచింది. గోడవలతో ఇద్దరు జిడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

అవినాష్ ఎలిమినేషన్ సరైనదేనా?

అవినాష్ ఎలిమినేషన్ సరైనదేనా?

లాస్య వెళ్లిపోయిన తరువాత హౌజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మేజర్ కంటెస్టెంట్స్ అనే చెప్పాలి. అయితే ఊహించని విధంగా అవినాష్ వెళ్లిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. కామెడీతో హడావుడి గట్టిగానే చేసినప్పటికి ఎందుకో వర్కౌట్ కాలేదు. గేమ్ లో కెమెరాలన్ని ఎక్కువగా ఫోకస్ అయ్యేలా అవినాష్ కామెడీ చేయడం అందరిని ఎట్రాక్ట్ చేసింది. ఇక అతను ఎలిమినెట్ కావడంతో గతంలో మాదిరిగా మరోసారి అన్యాయం జరిగిందా లేదా అని ప్రశ్నించగా 64% జనాలు అన్యాయం జరిగిందని, అవునని ఓటు వేశారు. కరెక్ట్ కాదు అని కేవలం 32% జనాలు మాత్రమే కోరుకున్నారు.

మోనాల్ సేవ్ అవ్వడం ఆశ్చర్యంగా అనిపించిందా?

మోనాల్ సేవ్ అవ్వడం ఆశ్చర్యంగా అనిపించిందా?

అంతా బాగానే ఉంది కాని గత వారం మోనాల్ సేవ్ కావడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అవినాష్ తో పోటీగా ఆమె డేంజర్ జోన్ లోకి రాగా ఇద్దరికి పరీక్ష పెట్టిన బిగ్ బాస్ చివరికి అవినాష్ ఎలిమినెట్ అయ్యాడని షాక్ ఇచ్చారు. ఇక మోనాల్ సేవ్ అవ్వడం ఆశ్చర్యంగా ఆనిపించిందా? అనే ప్రశ్నకు అవును అంటూ 80% జనాలు క్లారిటీ ఇవ్వగా.. కాదు అంటూ 17% మంది మాత్రమే సపోర్ట్ చేశారు.

ఈ వారం ఏలిమినెట్ అయ్యేది ఎవరు?

ఈ వారం ఏలిమినెట్ అయ్యేది ఎవరు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 14వ వారానికి చేరుకుంది. దీంతో ఈ వారం హౌజ్ నుంచి వెళ్లే కంటెస్టెంట్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎదో ఒక విధంగా క్రేజ్ అందుకున్నవారే. బలంగా పోరాడుతున్నారు కూడా. ఇక జనాల ఫోకస్ మాత్రం ఈ వారం కూడా మోనాల్ పైనే ఉంది. 51% జనాలు ఆమె వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు.ఇక ఆ తరువాత హారిక(14%), సోహెల్ (6%), అరియానా(10%), అబిజిత్(9%) కూడా వెళ్లిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
బిగ్ బాస్ విన్నర్ పై ఆడియెన్స్ క్లారిటీ

బిగ్ బాస్ విన్నర్ పై ఆడియెన్స్ క్లారిటీ

ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరనే విషయంలో మరోసారి ఆడియెన్స్ ని వివరణ కోరగా అభిజిత్ కు 62% నెటిజన్స్ ఓటు వేశారు. గత మూడు వారాలుగా అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇక అరియానా (14%), సోహెల్ (10%), ఫైనల్ కు లక్కు మీద చేరుకున్న అఖిల్ (5%), హారిక (4%), మోనాల్ (2%).. తరువాతి స్థానాల్లో ఉన్నారు. మరి చివరికి బిగ్ బాస్ ఆడియెన్స్ అంచనాలకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X