సారీ చెప్పకపోతే సీజన్ మొత్తం నామినేట్ చేస్తాడట.. కుమార్ సాయి రెచ్చిపోయాడుగా!!
బిగ్‌బాస్ మూడో వారాంతాన్ని హీటెక్కించడానికి కింగ్ నాగార్జున వచ్చేశాడు. ఇక ఉక్కు హృదయం టాస్క్ పెట్టిన చిచ్చు, జరిగిన గొడవలు, రోబోల తెలివి, మనుషలు అమాయకత్వం, సభ్యుల మధ్య పెరిగిన దూరం ఇలా ప్రతీ ఒక్క అంశాన్ని టచ్ చేసేందుకు నాగ్ రెడీ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఒక్కొక్క కంటెస్టెంట్ లెక్కలు తేల్చాడు. అయితే కుమార్ సాయి మాత్రం తనకు సంబంధం లేని టాపిక్‌ను టచ్ చేసినట్టు కనిపిస్తోంది.

అందరిపైనా సెటైర్లు..
కథ వేరేలా ఉంటుందని అన్నావ్ అదేంటి? అని నాగ్ సోహెల్‌పై సెటైర్ వేశాడు. అమ్మ రాజశేఖర్ కాదు.. అమాయకపు రాజశేఖర్ అని అవినాష్ చేతిలో మోసపోయిన సంఘటనను గుర్తు చేశాడు. గంగవ్వ దొంగ బాగా ఆడుతున్నావ్ అంటూ కౌంటర్ వేశాడు. ఇంట్లో ఎవరినైనా చూసుకోవచ్చు కదా అని అవినాష్‌కు చురకలంటించాడు.

అభిజీత్, అఖిల్ మధ్య గొడవ...
అభిజీత్, అఖిల్ మధ్య ఉన్న గొడవ గురించి అందరికీ తెలిసిందే. రా అని పిలవొచ్చా అని అఖిల్ అభిజీత్‌ను అడిగాడని, అయితే బాగానే మాట్లాడుతున్నాడు కదా.. ఏజ్‌లో చిన్నవాడే అయినా ఫ్రెండ్ కదా అని పిలవమని చెప్పినట్టు ఆ మధ్య అన్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఏదో సందర్భంలో అరేయ్ అభిజీత్ అని అన్నాడట.. మామూలుగా రా అనడం వేరు అరేయ్ రారా అని అనడం వేరంటూ ఆ విషయంలో ఫీలవ్వడంతో అఖిల్‌తో అంతగా మాట్లాడకుండా దూరంగా ఉంటున్నాడు అభిజీత్.

ఆ విషయాన్ని ప్రస్థావించిన కుమార్ సాయి..
అఖిల్ కంటే అభిజీత్ పెద్దవాడు.. అఖిల్‌కు 24 అయితే అభిజీత్‌కు 30 అట చదువు కూడా తక్కువేనట.. ఆయన ఈయన్ను రా అని పిలవడంతో హర్ట్ అయ్యాడట అంటూ కుమార్ సాయి చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంలో అఖిల్ ఎంటరవ్ అవుతూ.. నాకు చదువు తక్కువే అయినా ఎలా మాట్లాడాలో తెలుసంటూ అభికి కౌంటర్ వేశాడు.
Recommended Video
సారి చెప్పేవరకు నామినేట్..
ఆ విషయంలో సారి చెప్పే వరకు నామినేట్ చేస్తూనే ఉంటాను అని కుమార్ సాయి వీరావేశంగా మాట్లాడేశాడు. అయితే అది ఏ విషయం మాత్రం కరెక్ట్‌గా తెలియడం లేదు కానీ సోషల్ మీడియాలో కుమార్ సాయిపై ట్రోలింగ్ మొదలైంది. అయితే ప్రోమోను చూసి ఎపిసోడ్‌ను అంచనా వేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.


Click it and Unblock the Notifications











