మహానాయకుడు అభిజీత్.. నకిలీ మనిషి అంటూ కుమార్ సాయి ఫైర్
బిగ్‌బాస్ షో మూడో వారం ముగిసేందుకు వచ్చింది. ఈ క్రమంలో మూడో వీకెండ్‌లో ప్రేక్షకులను అలరించేందకు నాగార్జున వచ్చేశాడు. ఉక్కు హృదయం టాస్క్‌లో వచ్చిన మనస్పర్దలు, జరిగిన గొడవలను సద్దుమణిగేలా చేశాడు. ఇక నామినేషన్‌లో ఉన్న ఏడుగురితో ఓ ఆట ఆడించాడు. ట్రూత్ టవర్ అంటూ ఓ ఆట ఆడించి వారి మనసులో ఉన్నదంతా బయటకు కక్కించాడు. ఈ క్రమంలో కుమార్ సాయి అభిజీత్‌పై విరుచుకుపడ్డాడు.

జంగా టవర్‌తో ఆట..
జంగా టవర్‌లో ఉన్న బ్లాక్స్‌ను కిందపడకుండా తీయడమే ఈ టాస్క్. ఇక నామినేషన్‌లో ఉన్న ఒకొక్కరు వచ్చి ఒక్కో బ్లాక్ తీశారు. హారిక వచ్చి మొదటి బ్లాక్ తీసేసింది. ఇంటి సభ్యుల్లో నీకు పోటీ కానే కాదని ఎవరిని అనుకుంటావ్ అని హారికను నాగ్ ప్రశ్నించాడు. కుమార్ సాయి విషయంలో తనకు అలా అనిపిస్తుందని హారిక తెలిపింది. దివిని కిడ్నాప్ చేసిన తరువాత అభి నీకే ఎందుకు చార్జింగ్ ఇచ్చాడు అని నాగ్ అడగడంతో అందరూ చప్పట్లు కొట్టేశారు.

చిరాకు తెప్పిస్తాడు..
అలా అందరూ సక్సస్ ఫుల్‌గా తీశారు. అయితే నారథుడి లాంటి వాడు ఎవరని మోనాల్‌ను అడిగితే సోహెల్ అంటూ సమాధానం ఇచ్చింది. ఉత్తమ అబద్దాల కోరు ఎవరని లాస్యను అడిగితే మోనాల్ అని ఆన్సర్ ఇచ్చింది. ఎవరిని ఎలిమినేట్ చేయాలని అనుకుంటావ్ అని దేవీ నాగవల్లిని అడిగితే.. కుమార్ సాయి అంటూ చెప్పింది. చిరాకు తెప్పించే క్యారెక్టర్ ఎవరని అడిగితే సోహెల్ అని తెలిపింది.

కుమర్ సాయి ఫైర్..
ఇంట్లో ఉండే అర్హత లేని వ్యక్తి ఎవరని మెహబూబ్‌ని అడిగితే.. కుమార్ సాయి అని తెలిపాడు. ఇక కుమార్ సాయి మాత్రం తన మనసులో ఉన్నదంతా కక్కేశాడు. అభిజీత్‌పై ఉన్న కోపాన్ని వ్యక్తం చేశాడు. నకిలీ మనిషి అంటూ వ్యక్తిగత దూషణలు చేస్తాడని ఆరోపణలు చేశాడు.

మహానాయకుడు అభిజీత్..
టాస్క్ గెలిచిన కంటెస్టెంట్లకు అవార్డులంటూ మహానాయకుడు, మహాకంత్రి, మహానటి అనే అవార్డులను ఇవ్వాలని తెలిపాడు. మహానాయకుడు ఎవరని అనుకుంటున్నారు అంటూ ఇంటి సభ్యులను నాగ్ అడిగాడు. వారంతా గంగవ్వ పేరును సూచించారు. కానీ నాగ్ మాత్రం మహానాయకుడు అభిజీత్ అని ప్రకటించాడు. మహాకంత్రి అవినాష్, మహానటిగా గంగవ్వకు అవార్డులు లభించాయి.

మనస్పర్ధలు పోగొట్టేలా..
ఇంటి సభ్యుల మధ్య ఉన్న మనస్పర్దలు పోగొట్టేలా ఆట ఆడించాడు. మోనాల్-అఖిల్, నోయల్-అమ్మ రాజశేఖర్, దివి-అభిజీత్, దేవీ -గంగవ్వ, అవినాష్-లాస్య, సుజాత-అభిజీత్, అమ్మ రాజశేఖర్-దివి, లాస్య-స్వాతి దీక్షిత్‌లకు జోడి చేస్తూ టాస్క్ ఇచ్చాడు. నెగెటివ్ పాయింట్స్ చెప్పమని టాస్క్ ఇవ్వడంతో అందరూ వారి వారి బ్యాడ్ క్వాలిటీలను తెలిపారు.
Recommended Video

ఇద్దరు సేవ్..
మూడో వారంలో నామినేట్ అయిన దేవీ, లాస్య, హారిక, మోనాల్, మెహబూబ్, ఆరియానా,కుమార్ సాయిల్లో లాస్య, మోనాల్ సేవ్ అయినట్టు నాగ్ ప్రకటించాడు. ఇక ఎలిమినేట్ కాబోయేది మెహబూబ్ అంటూ టాక్ వినిపించినా చివరి నిమిషంలో దేవీ నాగవల్లి పేరు కూడా తెరపైకి వచ్చింది. అసలు ఏం జరుగుతుందోచూడాలి.


Click it and Unblock the Notifications











