ఒక అమ్మాయి వల్ల విడిపోయి.. అమ్మ రాకతో ఒక్కటైన అభి, అఖిల్.. ఏమనుకున్నారంటే

బిగ్ బాస్ 74వ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన ఎమోషనల్ టచ్ మామూలుగా లేదు. డెబ్భై రోజులకు పైగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఒక హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ సడన్ గా కుటుంబ సభ్యులను చూడడంతో కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక బిగ్ బాస్ లో శత్రువులుగా ఉండే అభిజిత్, అఖిల్ మదర్ సెంటిమెంట్ తో ఒక్కటవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

అభి, అఖిల్.. నెవర్ బిఫోర్ ఎమోషన్స్

అభి, అఖిల్.. నెవర్ బిఫోర్ ఎమోషన్స్

సాధారణంగా హౌజ్ లో కంటెస్టెంట్స్ గేమ్ అదే క్రమంలో ఎమోషన్స్ కి ఏ మాత్రం కనెక్ట్ అయినా కూడా గెలవడం చాలా కష్టం. అందుకే వీలైనంత వరకు స్వార్థంతోనే ఆలోచిస్తుంటారు. అయితే గేమ్ లో ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరు ఊహించలేరు. ఇక బుధవారం మదర్స్ రావడంతో అఖిల్, అభిజిత్ లో ఎవరికి తెలియని ఎమోషన్స్ కనిపించాయి.

అమ్మ రాకతో గొడవలు మాయం

అమ్మ రాకతో గొడవలు మాయం

ఒక అమ్మాయి (మోనాల్) కారణంగా మొదలైన గొడవలు ఒక్కసారిగా అమ్మల రాకతో మాయమయ్యాయి. మొదటిసారి బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ చాలా ఓపెన్ గా ఎమోషనల్ గా కనిపించనున్నట్లు అర్ధమయ్యింది. మొదట అఖిల్ తల్లి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అతన్ని చూడగానే బోరున ఏడ్చిన అఖిల్ ని అభిజిత్ దగ్గరుండి ఓదార్చడు. అఖిల్ తల్లి కూడా ఇద్దరు బ్రదర్స్ లా ఉండండని చెప్పింది.

పర్సనల్ గా మనకు గొడవలు లేవు

పర్సనల్ గా మనకు గొడవలు లేవు

ఇక అఖిల్ తల్లి వెళ్లిపోగానే అభిజిత్ పక్కనే కూర్చుని అఖిల్ తో చాలా కూల్ గా మాట్లాడాడు. ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది.. నా వల్ల హార్ట్ అయ్యి ఉంటే సారి అని చెప్పడంతో.. అఖిల్ కూడా అంతే కూల్ గా సమాధానం ఇచ్చాడు. ఇది ఒక గేమ్ మాత్రమే.. పర్సనల్ గా మనకు ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
కలవాలని అనుకుంటే ఎదో జరుగుతోంది

కలవాలని అనుకుంటే ఎదో జరుగుతోంది

మన ఇద్దరం కలుద్దామని అనుకుంటున్నాం కానీ సడన్ గా ఎదో అవుతోందని అఖిల్, అభిజిత్ మాట్లాడుకోవడం చూస్తుంటే నిజంగా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారని తెలుస్తోంది. కానీ బిగ్ బాస్ హౌజ్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఎమోషనల్ గా ఉన్నప్పటికీ టాస్కుల వద్దకు వచ్చేసరికి తప్పకుండా మారిపోవాల్సిందే. ఏదేమైనా షోలో మదర్ సెంటిమెంట్ ఒక కొత్త వాతావరణం క్రియేట్ చేసింది. మరి ఈ వారం ఎలిమినేషన్స్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X